నేటికాలంలో ప్రభుత్వ పథకాల నుంచి ఏ లబ్ధి పొందాలను ముందు ఆధార్ తప్పనిసరిగా మారింది. అంతే కాక ఏ ఇతర వాటికి దరఖాస్తు చేసుకోవాలన్న ఆధార్ కార్డు అడుగుతన్నారు. ప్రస్తుత ఆధార్ కార్డు ఉంటేనే మనిషిగా ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆఫీసులు మొదలుకొని, ప్రైవేటు సంస్థల వరకు అన్ని ఆధార్ కార్డుతో వివిధ పనులు చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ ప్రాంతంలో పెళ్లి భోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని షరుత్ పెట్టారు. ఆధార్ కార్డు ఉన్న వారికి భోజనాలని సదరు నిర్వహాకులు తెలిపారు. దీంతో ఆ పెళ్లికి వచ్చిన అతిథులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. అసలు పెళ్లి వారు అలా చేయడానికి కారణం ఏమిటో ఇప్పడు తెలుసుకుందాం…
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహాలోని అడంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ పూర్ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లికి భారీ సంఖ్యలో బంధువులు హాజరయ్యారు. ఇక వివాహ అనంతరం భోజనాలకు సిద్ధమయ్యారు అక్కడి వచ్చిన అతిథులు. అయితే ఇంతలోనే వారికి పెళ్లిపెద్దలు షాక్ ఇచ్చాచారు. భోజనం చేయాలంటే ఆధార్ కార్డు ఉండాలని తెలిపారు. దీంతో ఆ సమయానికి ఆధార్ కార్డు ఉన్నవాళ్లు మాత్రమే భోజనాలు చేశారు. ఆధార్ కార్డు లేనివాళ్లు చాలామంది ఆకలితోనే వెనుదిరగాల్సి వచ్చింది. కొంతమంది దీనిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఇలా చేయడాని ఆ వధువు తరుపు కుటుంబ సభ్యులు ఓ కారణం చెప్పారు.
సెప్టెంబర్ 21న హసన్‌పూర్‌లో రెండు వేర్వేరు పెళ్లి, బరాత్‌లు జరిగాయి. అందులో ఓ పెళ్లి భోజనాల సమయంలో రెండు పెళ్లిలకు వచ్చిన అతిథులు కలగలసి పోయారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. అనుకున్నదాని కంటే అధిక సంఖ్యలో అతిథులు కనిపించడంతో.. వధువు కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. దాంతో ఏం చేయాలో పాలుపోక మొదట భోజనాలు ఆపేశారు. బయట పెళ్లికొచ్చిన వారంతా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో వధువు కుటుంబ సభ్యులకు ఓ ఆలోచన వచ్చింది. ఆధార్ కార్డు ఉన్న వరుడి బంధువులకు మాత్రమే భోజనాలకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. దీంతో అక్కడి వచ్చిన వారంత అయోమయంకి గురయ్యారు. ఇందులో వేరే పెళ్లి నుంచి వచ్చిన వారు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లి పోయారు. అయితే ఆధార్ కార్డు తెచ్చుకోకుండా వీరి పెళ్లికి వచ్చిన వారు ఇబ్బందు పడ్డారు.
పెళ్లికి వస్తూ ఎవరు ఆధార్ కార్డులు తెచ్చుకోరు కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆధార్ కార్డు ఉన్నవాళ్లు మంచి భోజనం చేయగా.. లేని అతిథులు విందు తినకుండానే అక్కడి నుంచి వెనుతిరిగారు. అయితే కొంతమంది దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వధువు, వరుడి కుటుంబాలు సర్దిచెప్పి శాంతిం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై నెటిన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. మీరు పెళ్లికి భోజనాలు పెడుతున్నారా? లేకా బ్యాంక్ లో లోన్ ఏమైనా ఇస్తున్నారా? అంటూ విమర్శించారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.