ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంబవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పని సరి.. లేదంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. కానీ ఓ బస్సు నడిపే డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం ఎక్కడైనా చూశారా? అలాంటి సంఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతుంది.
ఉత్తర ప్రదేశ్ లోని గాజియాబాద్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది.. బస్సు నడుపుతున్న డ్రైవర్ తన తలకు హెల్మెట్ ధరించాడు. ఈ దృశ్యాన్ని కొందరు వ్యక్తులు ఫోటోలో కొట్టి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అయితే బస్సు రోడ్డు ప్రమాదానికి గురై అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఆదివారం సాయంత్రం లోని బాగ్‌పత్ సరిహద్దులో ఈ సంఘటన జరిగింది.
ఆ బస్సును మరో బస్సు ఢీ కొట్టడం వల్ల అద్దాలు పగిలిపోయాయని.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితి బాగాలేదు.. గాలికి ఆ అద్దాలు తనపై పడుతాయని భయంతో తన తలకు హెల్మెట్ ధరించాల్సి వచ్చిందని డ్రైవర్ తెలిపాడు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ కి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. 40 మందితో నదిలో పడిన బస్సు!
Picture of UP Roadways bus clicked in Baghpat pic.twitter.com/0hkJAimkfG
— Piyush Rai (@Benarasiyaa) July 17, 2022