ఈ మద్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టెకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో టెక్నికల్ ఇబ్బందుల వల్ల విమానాలు, హెలికాప్టర్లను వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు. ఇక శిక్షణ సమయంలో పైలెట్స్ తప్పిదాల వల్ల కూడా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. సాంకేతిక లోపాల వల్లనో, ప్రకృతి అనుకూలించకపోవడం, పక్షులు ఢీకొనడం, కొన్నిసార్లు రన్ వేలపై ల్యాండింగ్ చేసే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. విమాన ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఫైలట్ చాకచక్యంతో ఎమర్జెన్సీ లాండింగ్ చేసి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా సాంకేతిక లోపం వల్ల ఇండియా ట్రైనింగ్ విమానం కర్ణాటకలోని బెలగావిలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. పూర్తి వివరాలలోకి వెళితే…
రెడ్‌బర్డ్ శిక్షణా విమానం సాంకేతిక లోపంతో కర్ణాటక బెలగావిలోని వ్యవసాయ క్షేత్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న ఇద్దరు ఫైలట్‌లకు స్వల్పగాయాలు అయ్యాయి. గాయపడిన ఫైలట్లను చికిత్స నిమిత్తం ఎయిర్‌ఫోర్స్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 9.30 గంటలకు బెలగావిలోని సాంబ్రా విమానాశ్రయం నుంచి ప్లేన్ టేకాఫ్ అయింది. మధ్యలో శిక్షణ విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తడంతో బెలగావిలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.