భార్యాభర్తలు.. ఒకరికొకరు తోడు నీడగా జీవితాంతం కలిసి జీవిస్తుంటారు. అయితే కొందరు .. భాగస్వామిని కాదని పరాయి వారితో పడక సుఖాన్ని పంచుకుంటారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ముఖ్యంగా భార్యల పట్ల కొందరు భర్తలు కఠినంగా ఉంటారు. భార్య పరాయి మగాడితో మాట్లాడిన తట్టుకోలేని భర్తలను చాలా మందినే మనం చూస్తుంటాము. ఇక పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న భార్యను భర్త చంపేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. అయితే ఓ ప్రాంతం గురించి చెబితే మాత్రం మీరు తప్ప షాక్ అవుతారు. అది ఏమిటంటే.. భార్యలను అద్దెకు ఇస్తుంటారు ఆ ప్రాంతలోని భర్తలు. అది కూడా నెలలు, సంవత్సరాల లెక్కన భార్యలను పరాయి వారి వద్దకు పంపిస్తుంటారు. ఇది అక్కడి ఆచారం అంటా. అందుకే భార్యలను అద్దెకు ఇవ్వడాన్ని ఆ ప్రాంత ప్రజలు తప్పుగా భావించడం లేదు. మరి.. ఆ వింత ఆచారాన్ని పాటిస్తున్న.. ఆ వింత ప్రాంతం ఎక్కడో .. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలోని గ్యాలియర్ ప్రాంతం ఈ వింత ఆచారానికి వేదిక అయింది. ఈ ప్రాంతం రాచరికానికి , రాజపుత్రులకు, సంప్రదాయాలకు పెట్టింది పేరు. అందుకే గదులను , కార్లను, బైకులను అద్దెకు తెచ్చుకున్నట్లు ఇక్కడ భార్యలను అద్దెకు తెచ్చుకోవచ్చు. ఇక్కడ నచ్చిన మహిళను.. ఆమె భర్తకు డబ్బులు ఇచ్చి అద్దెకు తెచ్చుకోవచ్చు. ‘దడీచప్రథ’ అనే ఆచారం పేరుతో ఈ కార్యక్రమం తరతరాల నుంచి కొనసాగుతోంది. షోరూమ్స్‌లో బొమ్మల్ని నిలబెట్టినట్లు ఈ “భార్యల మార్కెట్లో” మహిళలను వరుసలో నిలబెట్టి మరీ అద్దెకి ఇస్తుంటారు. ఇంత ఓపెన్ గా జరుగుతున్న ప్రభుత్వం, అక్కడి అధికారులు పట్టించుకోరా? అనే సందేహం రావచ్చు. అయితే ఇక్కడ అంత పక్క ప్రణాళిక ప్రకారం జరుగుతంది.
భార్యలను అద్దెకు తీసుకునే ఈ వ్యవహారానికి పూర్తి చట్టబద్ధత కూడా ఉంది. రూ.10 లేదా రూ.100 స్టాంప్ మీద అగ్రిమెంట్ చేసుకుంటారు. తన వద్ద ఉన్న సమయంలో ఆమెకు ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అద్దెకు తీసుకెళ్లిన వ్యక్తలదే. వారి వద్ద ఉన్న సమయంలో ఆమెకు గర్భం వచ్చిన, ఇతర ఏదైన ప్రమాదం జరిగిన పూర్తిగా అద్దెకు తీసుకున్న వ్యక్తే బాధ్యత వహించాలి. ఇక ఇక్కడ భార్యల వయస్సును బట్టి వారికి రేటును నిర్ణయిస్తారు. వయస్సు తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వయస్సు ఎక్కువగా ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది. అలా వయస్సును బట్టి భర్తలకు డబ్బులు చెల్లించి.. భార్యలను తీసుకెళ్తుంటారు. అలానే పెళ్లి కానీ యువతులను కూడా అద్దె భార్యల ఆచారంతో తీసుకెళ్తుంటారు. అయితే ఇక్కడ మరోక నిబంధన కూడా ఉంది.
పెళ్లి కానీ వ్యక్తులు మాత్రమే భార్యలను అద్దెకు తీసుకెళ్లాలి. అయితే చాలామంది తమకు పెళ్లైన విషయం దాచిపెట్టి అద్దెకు భార్యలను కొనుక్కుంటారు. ఇక్కడ అద్దెకు వెళ్తున్న మహిళ ఇష్టాఅయిష్టాలను పరిగణలోకి తీసుకోరు. మంచి రేటు పలికితే.. ఆమెకు ఇష్టం లేకున్న పరాయి వ్యక్తికి వెంట భార్యలను పంపిస్తారు. నెల అద్దె, ఏడాది అద్దె లెక్కన చెల్లించే పద్ధతి ఇక్కడ ఉంది. ఈ అద్దెలు రూ. పదివేల నుంచి లక్ష అత్యధికంగా రూ.20 లక్షల వరకు వుంటుంది. ఒకవైపు దేశంలోని మహిళలు అందరు తమ హక్కుల కోసం పోరాడుతుంటే.. ఇక్కడి ఆడవాళ్లు పోరాడం చేయటం లేదు. కారణం ఆ ప్రాంతంలోని మహిళలపై వారి భర్తలకు పూర్తి హక్కులుంటాయని ఆ సమాజం తరతరలుగా నమ్ముతూ వస్తోంది. అంతేకాక జానెడు పొట్ట నింపుకోవడానికి భర్తలు కూడా మనసు చంపుకుని భార్యలను అద్దెకిస్తున్నారు.
దీనిలో కీలకపాత్ర పోషించేది మధ్యవర్తులే… పేదరికంలో మగ్గిపోతున్న కొన్ని కుటుంబాలకు డబ్బు ఆశచూపి.. ఆచారం పేరుతో ఇలా పరాయి వారి వద్దకు అద్దెకు పంపిస్తున్నారు. పేదరికం సృష్టించే అనేక ఘోరాల్లో ఇలాంటి వింత ఆచారం ఒకటని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా దురాచారాలను రూపుమాపి మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని అనేక మంది పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆచారాన్ని ఎంత దూరం చేయాలని అధికారులు, ప్రభుత్వం ప్రయత్నించి సఫలం కాలేదు. ఇలాంటి ఆచారాలు మధ్యప్రదేశ్ లోనే కాకుండా గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా మనుగడలో ఉంది. మరి.. ఈ వింత ఆచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.