బహిరంగ మార్కెట్లలో టమోటా ధరలు పతనమై, సరైన గిట్టుబాటు ధర లభించక అప్పుల బాధతో రైతులు ఆందోళన చెందుతున్నారు. టమాటలకు వ్యాపారులు ఇస్తున్న ధరలు చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
బహిరంగ మార్కెట్లలో టమోటా ధరలు పతనమై, సరైన గిట్టుబాటు ధర లభించక అప్పుల బాధతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ బోర్లు ఆయకట్టులో సుమారు వందాలఎకరాలకు పైగా టమోటా పంటలు వేశారు. పంట సాగుకు ఎకరాకు సుమారు లక్షకు పైగానే ఖర్చు చేశారు. ట్రాక్టర్ తో పొలం దుక్కి, నర్సరీల నుండి టమాటా మొక్కలు, ఎరువులు, జీవన ఎరువులు, టమోటా మొక్కలకి కర్రలు, క్రిమిసంహారక మందుల, కూలీలు కోసం లక్షకు పైగా ఖర్చు చేయక తప్పడం లేదు.
మహారాష్ట్రలోని ఓ మార్కెట్ 20కిలోల పెట్టెటకు 30 రూపాయలు ఇస్తామనరంట. దీంతో రైతులు తీవ్ర వేదన వ్యక్తం చేశారు. నేటికాలంలో 5 రూపాయలకు తక్కువ ఇస్తేనే బిచ్చగాడు బిచ్చం తీసుకోవడం లేదు. మీరు రూపాయి కే టమాటలను కొంటు వాళ్ల కన్న పెద్ద బిచ్చగాళ్లను చేసినారు సార్.. అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాక కడుపు మంటతో ట్రక్కులో మార్కెట్ కు తెచ్చిన టమాటలను రోడ్డు పైనే పడబోశారు. ఆ ధర మాకు పట్టదు.. మీ దయతో మేమ బతకలేము అంటూ రైతులు ఉచితంగా ఇస్తున్నాము.. అమ్మకుని బతకండి అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాక మార్కెట్ లో రోడ్డుపై టమటలు పోసి.. అక్కడి నుంచి కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి పయనమయ్యారు.
టమోటా పంటల కోసం రైతులు అదినకాడికి ప్రయివేట్ వ్యక్తుల వద్ద నుంచి అప్పులు చేశారు. మరికొందరు రైతులు బ్యాంకులలో ఇంట్లో బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ రుణాలు తీసుకున్నారు. వాటి నుంచి వచ్చిన డబ్బులతో పంటలు వేసి నేడు ఆ నగలు విడిపించు కోవడానికి వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. టమోటా రైతుల కష్టాలు వినే నాధుడే కరువయ్యారు. బిచ్చగాడి కంటే దారుణంగా రైతులు పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం టమోటా రైతుల పంట నష్టాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటుచేసి గిట్టుబాటు కల్పించాల్సిన అవసరముంది. ట్రక్కుల్లో టమాటలు తెచ్చి.. రైతులు రోడ్డుపై పారబోసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.