నిత్యం ఏదో ఒక చోట బాంబు బెదిరింపులు వినిపిస్తుంటాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురైవుతుంటారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగుళూరులో బాంబు బెదింపులు.. స్థానికంగా కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం బెంగుళూరు లోని ఏడు పాఠశాలలకి ఓ అజ్ఞాత అకౌంట్ నుంచి మెయిల్ వచ్చింది. పాఠశాలలో శక్తివంతమైన బాంబు ఉందని.. ఇది జోక్ కాదు. మీతో పాటు వందల మంది ప్రాణాలకు ప్రమాదం ఉంది. అంతా మీ చేతుల్లోనే ఉంది’ అంటూ మెయిల్ చేశారు. అంతేకాకుండా పాఠశాలల లిస్టు కూడా పంపించారు. దీంతో అప్రమమత్తమైన పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు స్క్వాడ్ బృందంతో ఆ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధాణకు వచ్చారు. దీంతో బాంబు బెదిరింపులు బూటకమని తేల్చారు. అయితే ఈ మెయిల్ చేసిన వారి గురించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.