విశ్వాసానికి మారుపేరైన శునకం.. తనను పెంచుకునే వారికి కాపాలాగా ఉంటూ రక్షిస్తూ ఉంటుంది. అలా ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం మరణిస్తే.. ఆ కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు లోనవుతారు. తాజాగా ఓ మాజీ మంత్రి అయితే శునకానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది.
ఈ భూమండలం మీద ప్రతి జీవి ప్రత్యేకమే. కొన్ని రకాల జంతువులు మానవులకు సహాయకారిగా ఉంటాయి. వాటిలో పాడిగేదెలు, ఎద్దులు, శునకాలు ఉంటాయి. ఇకపోతే విశ్వాసానికి మారుపేరైన శునకం.. తనను పెంచుకునే వారికి కాపాలాగా ఉంటూ రక్షిస్తూ ఉంటుంది. అలా పెంచుకున్న శునకం మరణిస్తే.. ఆ కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు లోనవుతారు. కొందరు అయితే ఏకంగా మనుషుల మాదిరే వాటికి అంత్యక్రియాలు నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ మాజీ మంత్రి కుటుంబం అలానే చేసింది. చనిపోయిన తమ పెంపుడు శునకం అంత్యక్రియలు హిందూ సాంప్రదాయం ప్రకారం చేసి మానవత్వం చాటుకున్నారు. ఆ వివరాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
బిహార్ కు చెందిన మాజీ మంత్రి బీమా భారతి.. 19 ఏళ్లుగ ఒక శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి ఇష్టమైన ఆహారం అందిస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అలానే తాము ఎక్కడి వెళ్లి.. వెంటనే ఈ పెంపుడు శునకాన్ని తీసుకెళ్లేవారు. బీమా భారతి.. ఆ శునకాన్ని తమ ఇంటిలో ఒక సభ్యుడిగా భావించేది. దానికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన.. ఆ కుటుంబ సభ్యులు అల్లాడిపోయే వారు. దాని పోషణ కోసం భారీగా ఖర్చుపెట్టే వారు. అలా ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న శునకం జబ్బున పడి మరణించింది.
దీంతో ఆవిడ చాలా బాధపడింది. మరణించిన శునకానికి మనుషులకు నిర్వహించినట్లే ఘనంగా అంత్యక్రియలు చేసింది. శునకం భౌతిక కాయం ఉన్న పాడెను మోస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంతిమయాత్రలో గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. ఈ అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలను బీమా భారతి తన ఫెస్ బుక్ ఖాతాలో షేర్ చేసి నివాళులర్పించారు. శునకంపై ఇంతటి ప్రేమను చాటుకున్న మాజీ మంత్రి బీమా భారతిని పలువురు మెచ్చుకుని అభినందిస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.