ఈ మద్య అక్కడక్కడ రైలు ప్రమాదాలు భారీ నష్టాలను తీసుకు వస్తున్నాయి. రైలు ప్రమాదాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది. పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలుకి పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కి ముంబైలోని మాతుంగా-దాదర్ స్టేషన్ల పట్టాలు తప్పడంతో మూడు బోగీలు ట్రాక్ పై నుంచి పక్కకు తొలగిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఏలాంటి ఆపద కలగలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
రైలు పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అక్కడకు చేరుకొని పరిస్థితి పరిశీలించారు.. సంఘటన స్థలానికి రిలీఫ్ రైళ్లను పంపినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. పట్టాలు తప్పిన ఘటన కారణంగా పలు రైళ్లకు అంతరాయం కలగడం ద్వారా కాస్త ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించారు రైల్వే అధికారులు. కాగా, భారతీయ రైల్వే సంస్థ ఇప్పటి వరకు 169 సంవత్పాలు పూర్తి చేసుకున్న క్రమంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.