తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకే చెందుతుంది. విద్యార్థుల తప్పులను సరిచేస్తూ, వారిని మంచి మార్గంలో నడిపించేది ఉపాధ్యాయుడే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుడి అనుభవాలను వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. కానీ నేటి రోజుల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థినుల పట్ల నీచంగా వ్యవహరిస్తున్నారు.
‘గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరహ, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయి శ్రీ గురువే నమహ:’అని గురువునుద్దేశించి ఓ శ్లోకం ఉంది. విద్యార్థులకు మంచి విద్యాబుద్దులు నేర్పించి, వారి ఉన్నతిని తోడ్పడేది గురువులే. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకే చెందుతుంది. విద్యార్థుల తప్పులను సరిచేస్తూ, వారిని మంచి మార్గంలో నడిపించేది ఉపాధ్యాయుడే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుడి అనుభవాలను వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువు వద్ద గడుపుతాడు. కానీ నేటి సమాజంలో ఉపాధ్యాయుడు మాత్రం కీచకలుగా మారుతున్నారు. విద్యార్థుల పట్ల ముఖ్యంగా అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ గౌరవ వృత్తికి కళంకం తెస్తున్నారు. తాజాగా మరో కీచక టీచర్ వ్యవహారం బయటపడింది.
రాజస్థాన్‌లోని బుండి జిల్లా డబ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థినిపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కన్నువేశాడు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ఉపాధ్యాయుడు అనిల్ నగర్ తన గదికి పిలిచి, తర్వాత బట్టలు తీసేయమని చెప్పి వేధించాడు. దీంతో ఆ బాలిక బయపడి అక్కడి నుండి పారిపోయి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపింది. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు దబ్లానా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఉపాధ్యాయుడు అనిల్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గత ఏడాది జరగ్గా..నిందితుడు పారిపోయాడు.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పాఠశాల విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు
గతేడాది అక్టోబరు 14న సదరు బాధితురాలు.. ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అనిల్ నగర్ పరారీలో ఉండడంతో పోలీసులు అతడి జాడ కనిపెట్టలేకపోయారు. అప్పటి నుంచి అనిల్ నగర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఎలాంటి క్లూ దొరకలేదు. నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో నిందితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అలసత్వానికి నిరసనగా కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరసన దీక్షకు దిగారు. ఎట్టకేలకు డబ్లానా పోలీసులు అతని కోసం వెతికి, నిందితుడైన ఉపాధ్యాయుడు అనిల్ నగర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.