తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, మానవత్వం చాటుకుంటూ తమిళ ప్రజలచేత శెభాష్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్ తన షెడ్యూల్ నుంచి కొంత సమయం విరామం తీసుకున్నారు.
ఈ క్రమంలో ఆయన నరికురవర్ లోని ఒక విద్యార్థిని ఇంటిని చూడటానికి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక ముఖ్యమంత్రి అంత చిన్న పూరి గుడిసెలో ఉన్నవారిని మందలించడానికి వెళ్లడం వెనుక ఒక పెద్ద కథనే ఉంది. ఇటీవల సరికురవర్ వర్గాల వారు వెనుకబడ్డారని, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక మీడియాలో వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన స్టాలిన్ చలించిపోయారు.. త్వరలో ఆ ఇంటికి వెళ్లి వారి చేతి భోజనం తింటానని హామీ ఇచ్చారు.
సీఎం స్టాలిన్ తన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత దివ్య అనే విద్యార్థి ఇంటికి వెళ్లారు. వారి కుటుంబంతో సరదాకా కాసేపు మాట్లడారు. ఈ సందర్భంగా దివ్య తల్లి సీఎం కి టిఫిన్ అచ్చారు. సాంబార్ ఇడ్లీ తిన్న స్టాలిన్ ఇది చాలా కారంగా ఉందీ అన్నారు.. అలా ఉండటం వల్లనే తమకు జలుబు, జ్వరాలు రావని చెప్పింది. ఇక నుంచి తాను కూడా అలాగే తింటానని ఆరోగ్యంగా ఉంటాను అంటూ నవ్వులు పూయించారు. తర్వాత కాఫీ తాగి ఇది చాలా రుచిగా ఉందమ్మ అంటూ కామెంట్ చేశారు.
అక్కడ నుంచి వెళ్లిన సీఎ స్టాలిన్ ఆరోగ్య బీమా పథకం కార్డు, రేషన్ కార్డులు, సామాజిక రక్షణ పథకం కింద ఆర్థిక సాయం, ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతికి అన్ని విధాల కృషి చేస్తానని అన్నారు. సంచారజాతుల వారు తయారుచేసిన వివిధ పూసల హారాన్ని సీఎం స్టాలిన్ మెడలో వేసి సత్కరించారు.