మరో ఎంఎన్సీ కంపెనీకి సీఈవోగా భారత్‌కు చెందిన ఓ వ్యక్తి నియమితులు అయ్యారు. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థల సీఈవోలుగా పనిచేస్తున్న మిగిలిన ఇండియన్స్ సరసన ఆయన కూడా చోటు దక్కించుకున్నారు.
భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఇక్కడ చదువకున్న వారు యూఎస్, ఆస్ట్రేలియా లాంటి విదేశాలకు వెళ్లి అక్కడ కూడా సత్తా చాటుతున్నారు. ఏకంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో అత్యున్నత పదవులను అలంకరిస్తున్నారు. ఎంఎన్సీల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా బాధ్యతలు చేపట్టి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో పాటు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్ తదితరులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో మరో భారతీయుడు చేరారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ కేఫ్ చెయిన్ స్టార్‌బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియామకం అయ్యారు.
లక్షణ్ నరసింహన్ సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత సెప్టెంబర్‌లో స్టార్‌బక్స్ కంపెనీ తదుపరి సీఈవో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నరసింహన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, అక్టోబర్ 1, 2022న నరసింహన్ స్టార్‌బక్స్ సంస్థలో చేరారు. ఇందుకోసం లండన్ నుంచి ఆయన సీటెల్‌కు వెళ్లారు. స్టార్ బక్స్‌లో చేరడానికి ముందు డ్యూరెక్స్ కండోమ్స్, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌ల తయారీదారు అయిన రెకిట్‌కి నరసింహన్ సీఈవోగా ఉన్నారు. ఇక, సీఈవోగా నరసింహన్ బాధ్యతలు చేపట్టడం మీద స్టార్‌బక్స్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మరి.. మరో ఎంఎన్సీ టాప్ పోస్టుకు భారతీయ సంతతి వ్యక్తి ఎంపికవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Now Indian-origin Laxman Narasimhan takes over as Starbucks CEO.
Indians ruling the world 🔥!!
— Times Algebra (@TimesAlgebraIND) March 21, 2023