ఈ మధ్య కాలంలో సడెన్ గుండె పోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. డ్యాన్స్‌లు చేస్తూ గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య వందల్లో ఉంది. తాజాగా, గణతంత్ర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలోని రాయ్‌చూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయ్‌చూర్ జిల్లాలోని సింధనూరు తాలూకా, దిద్దిగి గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహంతేశ్ అనే వ్యక్తి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్నాడు.
గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సింధనూరుకు వెళ్లాడు. అక్కడి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. దేశ భక్తి గీతానికి తోటి వారితో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి అతడు కుప్పకులాడు. అక్కడి వారికి మహంతేశ్‌కు ఏం జరిగిందో అర్థంకాలేదు. స్ప్రహ కోల్పోయిన అతడ్ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచాడు. మహంతేశ్ గుండెపోటు కారణంగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సింధనూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సడెన్ గుండెపోటు చిన్నా పెద్దా తేడా లేకుండా వస్తున్నాయి. 20 ఏళ్ల లోపు ఉన్నవారిని కూడా చంపేస్తున్నాయి. ఇలా సడెన్ గుండెపోటు రావటానికి కారణం ఏంటన్నది తెలియరావటం లేదు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఆడిపాడుతున్న వారు కూడా మృత్యువాతపడుతున్నారు. మరి, గణతంత్ర వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ.. సడెన్ గుండెపోటు కారణంగా చనిపోయిన మహంతేశ్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.