ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ ఇవ్వాల్సిందిగా శివసేన సుప్రీం కోర్టును కోరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ఉదంతం దుమారంగా మారుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఎన్సీబీ వర్సెస్ శివసేనగా మారింది. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు శివసేన నేత కిశోర్ తివారీ. ఈ-మెయిల్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఆర్యన్‌ఖాన్ ప్రాథమిక హక్కులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు తివారీ. ముంబైలో డ్రగ్స్ పార్టీ క్రూయిజ్ పట్టుబడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కోసం శివసేన నాయకులు సుప్రీం కోర్టు తలుపులు తట్టారు.
ఆర్యన్‌ఖాన్ అరెస్ట్ వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు శివసేన నేతలు. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే బీజేపీ కార్యకర్తలా మారారని ఆరోపిస్తున్నారు. అలాగే NCB అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. NCBపై న్యాయవిచారణ జరపాలని కిశోర్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నారు ఆర్యన్‌ఖాన్. పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినా తిరస్కరించింది కోర్ట్. 5 రోజుల క్రితం ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. బెయిల్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం తీర్పు వెల్లడించనుంది.