దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అతి వేగంగా వస్తున్న వాహనాలు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో విపరీతంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు అనుకోని సంఘటనల వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డుపై వాహనాలు వెళుతున్నపుడు అనుకోకుండా పశువులు, కుక్కలు రోడ్డుపై అడ్డువస్తాయి. వాటిని తప్పించబోయి వాహనాలను అదుపు చేసే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తాయి. అలాంటి సంఘటనే న్యూఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో కూడా చోటు చేసుకుంది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్‌షె లగ్జరీ స్పోర్ట్స్ కారు అదుపుతప్పి ఓ చెట్టుకు ఢీకొని కాలి బూడిదైంది. అసలు వివరాలలోకి వెళితే..
మన్‌కీరత్ సింగ్ అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున తన పోర్‌షె లగ్జరీ స్పోర్ట్స్ కారులో వెళ్తున్నాడు. అదే సమయంలో కారుకు ఎదురుగా ఒక కుక్క అడ్డువచ్చింది. ఆ కుక్కను తప్పించబోయే క్రమంలో మన్‌కీరత్ సింగ్ కారు అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకొంది. దీంతో కారు పార్ట్స్ కొన్ని 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. కారు ఇంజిన్ లో నుండి మంటలు చెలరేగాయి. మన్‌కీరత్ సింగ్ కాలిన గాయాలతో బయటపడ్డాడు. కారు మాత్రం కాలి బూడిదైంది. గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుండి సికందేర్ పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Gurugram | A speeding luxury car caught fire & burned to ashes after hitting a tree at Golf Course road, in the early morning hours today. The car also collided with a divider before hitting a tree. The driver fled the spot, no one was injured in the incident pic.twitter.com/FG1ACXbdmB
— ANI (@ANI) May 11, 2023