గతంలో పోలిస్తే ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం నగరాలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా వచ్చాక.. ఆయా రంగాలలో స్థిరపడ్డాక బాగా డబ్బు సంపాదించి నగరాల్లోనే స్థిరపడుతున్నారు. లక్షలకు.. లక్షలు పోసి అపార్ట్మెంట్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్లను కొనేస్తున్నారు. ఇక ధనవంతుల సంగతయితే చెప్పక్కర్లేదు. కోట్లు వెచ్చించి విలవంతమైన ఇళ్లను చేజిక్కించుకుంటుంటారు. అలాంటి భారీ డీల్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది దేశీయ రియాలిటీ మార్కెట్ లోనే అతి పెద్ద డీల్ అని గుసగుసలు వినపడుతున్నాయి.
ఆర్థిక రాజధాని ముంబైలో అద్దెకుండటం అంటేనే మహా కష్టం. లక్షకు పైగా జీతం ఉంటే తప్ప కుటుంబాన్ని, పిల్లలను పోషించుకోలేరు. సినీ సెలెబ్రిటీలు, బడా బడా వ్యాపారస్తులకు స్వర్గధామమైన ముంబైలో సామాన్యులు ఇల్లు కొనడమనేది ఓ కల. దేశంలోని ధనవంతుల్లో చాలామంది ముంబైలో నివసిస్తుంటారు. వారు నివసిస్తున్న ఇల్లులు ఇంద్ర మహల్ లా ఉంటాయి. అందుకోసం వారు కోట్లు వెచ్చిస్తుంటారు. ఆ కొరికే ఓ భారీ డీల్ కు వేదికైంది. ఒక రియాలిటీ సంస్థ నిర్మించిన 23 లగ్జరీ హోమ్స్ ఏకంగా 1,200 కోట్ల రూపాయల ధరకు అమ్ముడుపోయాయి. అంటే.. 5వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఒక్కో ఇంటి ధర అటు ఇటుగా 50 కోట్ల రూపాయల పైమాటే అన్నమాట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ 23 ఇళ్లనూ ఒకే కుటుంబానికి చెందిన దగ్గరి బంధువులే కొన్నట్లు సమాచారం. వీరంతా డీమార్ట్ ఫౌండర్ రాధాకృష్ణన్ దమానీ దగ్గరి బంధువులని తెలుస్తోంది. వీరి కుటుంబీకులు, దగ్గరి బంధువులంతా కలిసి ఉమ్మడిగా ఈ లగ్జరీ హోమ్స్ ని సొంతం చేసుకున్నారట.
Flats in Worli, Mumbai were sold at a discounted rate!
Friends & Relatives of Dmart’s Radhakishan Damani purchased 23 flats for Rs 1,200 crores. pic.twitter.com/KBAcRhEe0r
— Marketing Maverick (@MarketingMvrick) February 5, 2023
సాధారణంగా ఈ లగ్జరీ హోమ్స్ ధర ఒక్కొక్కటిగా కొని ఉంటే..అరవై కోట్ల రూపాయల పైమాటే ఉంటుందట. బల్క్ డీల్ కావడంతో చవక ధరకు దక్కాయని అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ సదరు సంస్థకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉండటంతో ఈ డీల్ కు ఓకే చెప్పిందని, ఒక్కో ఫ్లాట్ ను దాదాపు 50 కోట్ల ధరకు అమ్మేసిందని అంటున్నారు. ఏదేమైనా.. 20 ఇళ్ల కోసం రూ.1200 కోట్లు వెచ్చించడమనేది దేశంలోనే హాట్ టాపిక్ అవుతోంది. ఈ డీల్ పై మీ అభిప్రాయాలేంటో.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.