Mother: ఓ మహిళ తల్లి అన్న బంధానికే కలంకం తెచ్చేలా ప్రవర్తించింది. భర్త మీద కోపాన్ని 2 నెలల కూతురి మీద చూపించింది. పసి పాప అని కూడా చూడకుండా దారుణంగా హింసించింది. దాన్నంతా వీడియో తీసి భర్తను బెదిరించి డబ్బులు గుంజాలని చూసింది. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… రాజస్తాన్, చురు జిల్లా, గజ్‌సర్ గ్రామానికి చెందిన ప్రకాశ్ నాథ్‌కు సంవత్సరం క్రితం లాద్‌నన్ గ్రామానికి చెందిన క్రిష్ణ అనే యువతితో వివాహం అయింది. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భవతి అని తెలిసింది. నాలుగు నెలల క్రితం క్రిష్ణ తండ్రి.. ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. క్రిష్ణకు రక్తం చాలా తక్కువగా ఉందని, అబార్షన్ చేయిద్దామని అతడికి చెప్పాడు. అయితే, ఇందుకు ప్రశాంత్ ఒప్పుకోలేదు. ఆమెకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రక్తం ఎక్కిందామని చెప్పాడు. ఈ సమయంలో క్రిష్ణ తండ్రి తన చిన్న కూతురు పెళ్లి గురించి కూడా మాట్లాడాడు.
ప్రశాంత్ చిన్న తమ్ముడికి తన చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని అడిగాడు. అంతేకాదు! అందుకోసం రూ. 50 వేలు ఇవ్వాలని కోరాడు. ప్రశాంత్ తండ్రి ఇందుకు ఒప్పుకున్నాడు. 50 వేలు ఇచ్చి పంపించాడు. రెండు నెలల క్రితం క్రిష్ణ ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు జరిగిన కొద్ది రోజుల తర్వాత క్రిష్ణ తండ్రి ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. కూతుర్ని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత క్రిష్ణ అత్తింటికి తిరిగి వెళ్లలేదు. రోజులు గడుస్తున్నా క్రిష్ణ ఇంటికి తిరిగి రాకపోవటంతో ప్రశాంత్ ఆమె దగ్గరకు వెళ్లాడు. భార్యాబిడ్డను వెనక్కు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ, క్రిష్ణ, ప్రశాంత్‌తో పాటు వెళ్లడానికి ఒప్పుకోలేదు.
తన కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తేనే వస్తానని చెప్పింది. లక్ష రూపాయలు ఇవ్వని కారణంగా క్రిష్ణ.. ప్రశాంత్‌తో పాటు వెళ్లలేదు. ప్రశాంత్ ఇలా కొన్ని పర్యాయాలు భార్యను దగ్గరకు వెళ్లి బ్రతిమాలాడు. ఆమె మనసు కరగలేదు. పైగా ఓ రోజు కూతుర్ని తల కిందులుగా చేసి హింసిస్తూ వీడియో తీసింది. దాన్ని భర్తకు పంపి బ్లాక్ మేయిల్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే కూతుర్ని చంపుతానని బెదిరించింది. దీంతో ప్రశాంత్ పోలీసులను ఆశ్రయించాడు. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే క్రిష్ణను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..!