గత కొంత కాలంగా దేశంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఇరు పక్షాల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు
దేశంలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కి పోతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీకి సూరత్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల రాహూల్ గాంధీ మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ ను దోషీగా తేల్చింది కోర్టు. 2019లో మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చి.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో ఈ తీర్పు ఇచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు బెయిల్ వచ్చింది.
2019 లో ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో సభలో రాహూల్ గాంధీ మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం సాగింది. ఈ నేపథ్యంలో గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్.. రాహూల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష..
2019లో మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చి.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో ఈ తీర్పు ఇచ్చింది. #RahulGandhi #PMModi #SumanTV
— SumanTV (@SumanTvOfficial) March 23, 2023