Beauty Contest: అందాల పోటీల్లో గెలిస్తే ఏదైనా గిఫ్టో, తలపై కిరీటమో పెట్టడం సహజం. కానీ, పోటీల్లో గెలిచిన అమ్మాయిలకు ఎన్ఆర్ఐతో పెళ్లి చేస్తామంటే.. ఇదేదో విచిత్రంగా ఉందే అనిపిస్తోంది కదూ. పంజాబ్‌లో ఈ వింత సంఘటన వెలుగు చూసింది. అందాల పోటీల్లో గెలిచిన అమ్మాయికి ఎన్ఆర్ఐ యువకుడితో పెళ్లి చేస్తామంటున్నారు నిర్వాహకులు. ఇంతకీ సంగతేంటంటే.. కొద్దిరోజుల క్రితం పంజాబ్‌లోని బతిందా నగరంలోని పలుచోట్ల కొన్ని పోస్టర్లు వెలుగుచూశాయి. ఆ పోస్టర్లలో అందాల పోటీకి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ‘‘ అందమైన యువతుల పోటీ’’ అంటూ ఆ పోస్టర్‌పై ఓ అందమైన యువతి ఫొటో కూడా ముద్రించి ఉంది. ఆ పోటీల్లో గెలిచిన యువతికి కెనడా ఎన్ఆర్ఐ యువకుడితో పెళ్లి చేస్తామని అందులో ఉంది. అక్టోబర్ 23న బతిందాలో ఈ అందాల పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ప్రస్తుతం అందాల పోటీలకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసు అధికారుల దృష్టికి కూడా వెళ్లాయి. దీంతో పోలీసులు దానిపై సీరియస్ అయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ అందాల పోటీలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని అంటున్నారు. అందాల పోటీ నిర్వాహకులు కొన్ని కులాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోస్టర్లపై ఉన్న నెంబర్లకు ఫోన్ చేయగా అవి పని చేయటం లేదు. ఇక, సోషల్ మీడియాలో నెటిజన్లు పోటీలపై స్పందిస్తూ.. ‘‘ ఆ పోటీలో పాల్గొనటానికి అమ్మాయిలు ఎగబడతారు చూడండి’’.. ‘‘ ఇందులో తప్పేముంది’’.. ‘‘ ఎన్ఆర్ఐతో పెళ్లంటే ఇండియన్స్‌కు ఎందుకంత పిచ్చి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Punjab | Police registered an FIR after posters advertising a beauty contest to be held on Oct 23 were put up in Bathinda. Posters advertised that the winning girl will be given a chance to marry a Canadian NRI.
(Pic Source: Bathinda Police) pic.twitter.com/Vj0wwjCdDr
— ANI (@ANI) October 14, 2022