భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తొలిసారి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖీయో 30ఎంకేఐ అనే యుద్ధ విమానంలో ప్రయాణించారు. అస్సాంలోని తేజ్ పూర్ ఎయిర్ బేస్ లో ఫ్లయింగ్ సూట్ ధరించి ఫైటర్ జెట్ లో ఆమె ప్రయాణించారు. అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా ద్రౌపది ముర్ము తొలిసారిగా సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రస్తుతం ఫ్లయింగ్ షూట్ లో ఉన్న రాష్ట్రపతి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలోని తేజ్ పూర్ లోని భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడ భద్రతా దళాల నుంచి రాష్ట్రపతి సైనిక వందనం అందుకున్నారు. అనంతరం కాసేపు యుద్ధ విమానాలను పరిశీలించారు. కాసేపటి తరువాత రాష్ట్రపతి ఫ్లయింగ్ సూట్ ధరించి సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఆ ఫైటర్ జెట్ లో బ్రహ్మపుత్ర, తేజ్ పూర్ పరిసర ప్రాంతాల్లోని అడవులను, లోయలను కవర్ చేస్తూ ప్రయాణించారు. దాదాపు 30 నిమిషాల పాటు యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించారు.
అలానే ద్రౌపది ముర్ము ప్రయాణించిన ఈ ఫైటర్ జెట్ ను 106 స్వ్రాడ్రన్ కమాండింగ్ అధికారి గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. ఈ విమానం సముద్రమట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన గంటకు 800 కిలోమీటర్ల వేగంగా ఎగిరింది. ఫ్లైయింగ్ సూట్ లో రాష్ట్రపతి అందరిని ఆకట్టుకున్నారు. 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రస్తుతం ఫ్లయింట్ సూట్ లో ద్రౌపది ముర్ము ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత నెలలో ద్రౌపది ముర్ము ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. స్వదేశీయంగా తయారు చేసిన ఈ విమానంలో అధికారులతో ఆవిడ సంభాషించారు. తాజాగా సుఖీయో యుద్ధ విమానంలో ప్రయాణించి అందరిని ఆకట్టుకున్నారు.
VIDEO | President Droupadi Murmu takes a sortie on a Sukhoi 30 MKI fighter aircraft at the Tezpur Air Force Station in Assam. pic.twitter.com/8GYEeepf8z
— Press Trust of India (@PTI_News) April 8, 2023