ఉత్తర్ ప్రదేశ్- నాలుగు రోజుల్లో నీ అంతు చూస్తాం.. ఈ బెదిరింపు వచ్చింది ఎవరికో కాదు.. సాక్షాత్తు ముఖ్యమంత్రికి. అవును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ మధ్య బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపుతామంటూ తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. యోగికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటూ ఉత్తరప్రదేశ్ పోలీస్ వాట్సాప్ ఎమర్జెన్సీ డయిల్ నెంబర్ 112కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ ఏప్రిల్ 29వ తేదీన వచ్చినట్లు పోలీసులు చెబుతు్నారు. దీనిపై సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఏ నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతే సంసత్సరం సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్‌లోనూ ఇదే తరహాలో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. నవంబర్‌లో యూపీ పోలీస్ 112 హెల్ప్‌లైన్‌కు 15 ఏళ్ల బాలుడు బెదిరింపు మెసేజ్ పంపించాడు. మొబైల్ నెంబర్ ఆధారంగా అతడిని ఆగ్రాలో అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు పంపారు. కోవిడ్ నేపథ్యంలో స్కూళ్లు మూసేరన్న కోపంతోనే అతడు బెదరింపు మెసేజ్ పంపినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక ఇప్పుడు వచ్చిన బెదిరింపు కాల్ పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.