వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, చేనేత వారికి, గీత కార్మికులకు పెన్షన్ అందించే ప్రభుత్వం ఇప్పుడు పెళ్లికాని వారికి పెన్షన్ అందించేందుకు సిద్దమవుతోంది. పెళ్లికాని స్త్రీ, పురుషులకు పెన్షన్ అందించడానికి ఓ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఎన్నికలలో పాల్గొనే రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రజలకు పలు రకాల హామీలను అందిస్తామని మానిఫెస్టో ద్వారా ప్రకటిస్తారు. ఎలక్షన్ లో గెలిచాక ఇచ్చినటుంటి హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఉచితంగా బియ్యం అందించడం, ఉచిత కరెంటు, బస్ ఛార్జీలు తగ్గించడం, పెన్షన్ అందించడం వంటి పథకాలను అమలు చేస్తారు. వీటన్నింటిలో ముందుగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ ను అందిస్తారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. త్వరలో పెళ్లికాని వారికి పెన్షన్ అందించడానికి సమాలోచనలు చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
ఏ రాష్ట్ర ప్రభుత్వమైన ప్రజల కోసం, పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వారిని ఆర్థికంగా ఆదుకుంటుంది. పేదరికాన్ని రూపుమాపేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించబోతోంది. పెళ్లి కాని వారికి పెన్షన్ అందించేందుకు సిద్దమవుతోంది. సాధారణంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, చేనేత వారికి, గీత కార్మికులకు పెన్షన్ అందించడం మనకు తెలిసిందే. ఆఖరికి నిరుద్యోగులకు కూడా భృతి అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మొట్టమొదటిసారి పెళ్లికాని వారికి పెన్షన్ అందించేందుకు హర్యానా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
పెళ్లి కాని మహిళలకు పెన్షన్ ఇచ్చేందుకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమాచోచనలు చేస్తున్నారు. మహిళలతో పాటు పురుషులకు కూడా పెన్షన్ అందివ్వనున్నారు. 45 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు గల అవివాహితులు ఆ పథకానికి అర్హులుగా ఉండే అవకాశం ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఓ 60 ఏళ్ల వయసున్న పెళ్లికాని మహిళ తనకు పెన్షన్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది. ఈ విషయంపై స్పందించిన ఖట్టర్ అవివాహితులకు పెన్షన్ ఇచ్చేందుకు ఓ పథకాన్ని ప్రారంభిస్తామని వెళ్లడించారు. ఇక ఈ నిర్ణయంతో హర్యానాలో త్వరలో అవివాహితులు పెన్షన్ పొందే అవకాశం ఉంది.