సాధారణంగా మన దగ్గర సెలబ్రిటీలు ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో చాలామంది తాము మిగతా జనాలకు భిన్నం అని భావిస్తారు. వారిని కలవడం, వారితో కలసి కూర్చోవడం, భోజనం చేయడం వంటివి చేయాలంటే.. నేతలకు మనసు రాదు. జనాలు అంటే వారి దృష్టిలో కేవలం ఓట్లు మాత్రమే. అయితే అందరూ నేతలు ఇలానే ఉంటారా అంటే లేదు. రాజకీయాల పరంగా వారు ఎలా ఉన్నా.. కళ్ల ముందు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేరు. వెంటనే స్పందించి.. చేతనైనా సాయం చేస్తాడు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి విమానంలో చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అదే విమానంలో ఉన్న కేంద్రమంత్రి, బీజేపీ నేత అతగాడి పరిస్థితి చూసి వెంటనే స్పందించారు. ఆ వ్యక్తికి చికిత్స అందించారు. ఆ వివరాలు..
శనివారం ఢిల్లీ-ఔరంగాబాద్ ఎయిరిండియా విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. విమానం సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. అతని పరిస్థితి గురించి అనౌన్స్‌మెంట్ చేశారు. ఎవరైనా డాక్టర్ ఉంటే ముందుకు రావాలని కోరారు. అదే ఫ్లైట్‌లో ఉన్న కేంద్ర మంత్రి డాక్టర్ బీకే కరాద్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత డాక్టర్ సుభాష్ భమ్రే వెంటనే స్పందించారు. పూర్తిగా విషయం తెలుసుకుని.. అస్వస్థతకు గురైన ఆ రోగి దగ్గరకి వెళ్లి పరిశీలించారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అలా ఒక రోగికి ఉపశమనం కలిగించారు.
ఇది కూడా చదవండి: విడాకులు పొందితే తీసుకున్న కట్నం, నగలు తిరిగి ఇవ్వాల్సిందే: హైకోర్టు
కేంద్ర మంత్రి బీకే కరాద్, బీజేపీ నేత డాక్టర్ సుభాష్ భమ్రే వీరిద్దరూ ఎంబీబీఎస్ పూర్తి చేయడమే కాకుండా వైద్యరంగంలో అనుభవం కూడా ఉంది. దాంతో ప్రయాణికుడికి చికిత్స చేయగలిగారు. అయితే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి.. చికిత్స చేయడంతో తోటి ప్రయాణికుల మన్ననలను గెలుచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఎయిరిండియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ వార్త చదివిన వారు.. కేంద్రమంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#FlyAI : A passenger onboard our Delhi-Aurangabad flt yesterday fell ill. As per SOP the crew announced to check if any doctor was on board. We would like to thank Dr B.K. Karad(Mos Finance) & Dr. Subhash Bhamre who immediately attended to him. pic.twitter.com/kmN8CMGYDL
— Air India (@airindiain) June 17, 2022
ఇది కూడా చదవండి: RGV Dance: గద్దర్ పాటకు స్టేజిపై స్టెప్పులేసిన RGV.. వీడియో వైరల్!