ఆర్ధిక కష్టాలతో అల్లాడుతున్న కుటుంబాల్లో అనారోగ్యాలు చుట్టు ముడితే ఇక అంతే సంగతులు. ఇంకా దారుణం ఏమిటంటే చనిపోయిన తమ వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక మోసుకెళ్లిన ఘటనకు అనేకం జరిగాయి. తాజాగా మరో విషాదకర ఘటన బెంగాల్ లో చోటుచేసుకుంది.
ప్రతి మనిషి జీవితాన్ని డబ్బు అనేది చాలా ముఖ్యం. ఇదే ధనం లేక జీవితాన్ని దుర్భరంగా గడిపే వారు మన చుట్టు ఎందరో కనిపిస్తుంటారు. ఇలా ఆర్ధిక కష్టాలతో అల్లాడుతున్న కుటుంబాల్లో అనారోగ్యాలు చుట్టు ముడితే ఇక అంతే సంగతులు. ఇంకా దారుణం ఏమిటంటే చనిపోయిన తమ వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక మోసుకెళ్లిన ఘటనకు అనేకం జరిగాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. డబ్బుల్లేక ఓ తండ్రి.. తన కుమారుడి శవంతో 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం ఉత్తర్ దినాజ్ పూర్ జిల్లా కలియగంజ్ ప్రాంతంలోని డంగిపారా గ్రామానికి చెందిన అసిం దేవశర్మ.. కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు ఐదు నెలల క్రితమే కవలలకు తండ్రయ్యాడు. ఇటీవలే ఆ పిల్లలిద్దరికి ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే చికిత్స కోసం స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించాడు. వారిని పరీక్షించిన వైద్యులు.. చికిత్స అందించారు. అయితే చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యులు రాయ్ గంజ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించారు.
అసిం దేవ శర్మ మాత్రం సిలీగుడిలోని ఉత్తర బెంగాల్ లోని వైద్య కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈక్రమంలో ఒక చిన్నారిని తీసుకుని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. మరో చిన్నారి మాత్రం చికిత్స పొందుతూ మృతిచెందాడు. తన బిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సిబ్బందిని అడిగాడు. అయితే అంబులెన్సు రోగులను తరలించేందుకే ఉచితమని, శవాలను తరలించేందుకు కాదని తెలిపారు. తెచ్చిన డబ్బులన్ని కుమారుడి చికిత్స కోసం ఖర్చయ్యాయి. చేతిలో చిల్లిగవ్వలేక.. బిడ్డను ఎలా తీసుకెళ్లాలో తెలియక దేవశర్మ తీవ్ర వేదన కు గురయ్యాడు.
ఇక చిన్నారి చనిపోయాడని తెలిస్తే.. బస్సులో ఎక్కించుకోరని భావించి.. తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అలా వివిధ బస్సులు మారుకుంటూ 200 కిలో మీటర్లు ప్రయాణించాడు. చివరకు కలియగంజ్ కు చేరుకున్నాక.. తెలిసిన వ్యక్తి ఒకరు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అలా ఇంటికి చేరుకున్న దేవశర్మ… కుమారుడి అంత్యక్రియలు నిర్వహించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వెల్లడించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రతిపక్ష బీజేపీ.. దీదీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This poor person has to carry the dead body of his child in the bag. He didn’t find any Ambulence. This is the condition of the health facility in West Bengal. This case is from Uttar Dinajpur district . Sad but this is the reality across all districts in West Bengal. pic.twitter.com/gOziExkCVF
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) May 14, 2023