రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలానే భాగస్వామి అయినా నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రిలయన్స్ కు సంబంధించిన పలు వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ.. ఆమె 24 గంటలు బిజీ బిజీగా గడుపుతుంటారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలానే భాగస్వామి అయినా నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రిలయన్స్ కు సంబంధించిన పలు వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తూ.. ఆమె 24 గంటలు బిజీ బిజీగా గడుపుతుంటారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీం బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక రిలయన్స్ ఇండస్ట్రీ నేతృత్వంలో నడిచే పలు సామాజిక కార్యక్రమాల నిర్వహణ కూడా ఆమె చూసుకుంటారు. ఆమె తరచూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. తాజాగా ఓ బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారుతో ఆమె కనిపించారు.
మన దేశంలో అత్యంత విలాసవంతమైన గ్యారేజీల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కార్ల గ్యారేజ్ ఒకటి. అందరూ దీని జియో గ్యారెజ్ అని పిలుస్తారు. ఇక్కడ అత్యాధునికి హైఎండ్ కార్లులు, సూపర్ లగ్జరీ వాహనాలు, ఎస్ యూవీ లు ఉన్నాయి. వీరి కుటుంబానికి సంబంధించిన కార్లు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా నీతా అంబానీ ఓ కార్లు స్టేడియానికి వచ్చి.. అందరిని ఆకట్టుకుంది. ఇటీవల వాంఖేడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు నీతా అంబానీ బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ ఎస్600లో వెళ్లారు.
మెర్సిడెస్ బెంజ్ లో ఎస్ క్లాస్ అంటే అంబానీ కుటుంబానికి ఇష్టమైన వాహనంగా కనిపిస్తోంది. దీంతో మరోసారి అంబానీ ఫ్యామిలీ కార్ల కలెక్షన్ గురించి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె స్టేడియానికి వచ్చిన కారు గురించి తెలుసుకునేందుకు అందరు తెగ సెర్చింగ్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. నీతా అంబానీ కనిపించిన కారు మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్‌కు చెందినది. ఈ కారు 2009కు చెందిన మోడల్ అని తెలిసింది.
అంటే దాదాపు 14 ఏళ్ల క్రితం నాటిది అన్నమాట. అలానే ఈ ఎస్600 కారు 5.5 లీటర్ టర్బోఛార్జడ్ వీ12 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 51o పీఎస్ పవర్‌ను కలిగి ఉంటుంది. అలానే 830 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక అంబానీ కుటుంబ సభ్యులందరూ అత్యాధునిక భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో మాత్రమే ప్రయాణిస్తారు. ఎస్600 లాంటి పాత మోడల్ కార్లలో వారు కనిపించడం చాలా అరుదు. అప్పట్లో మెర్సిడెస్ బెంజ్ ఎస్600 కారు నాన్ ఎఎమ్‌జీ వేరియంట్‌కు చెందిన ప్లాగ్‌షిప్ మోడల్.
చాలా మంది ఇటువంటి కారును తమ గ్యారేజ్‌లో ఉండాలని కోరుకుంటారు. అలానే అంబానీ గ్యారెజ్ లో కూడా ఈ మోడల్ కారును ఉంచారు. అత్యంత ఖరీదైన, విలాసవంతమైన, భద్రతాపరమైన కార్ల కాన్వాయ్‌లో మెర్సిడెస్ బెంజ్ ఎస్600 ఒకటి. అంబానీ కుటుంబం ఎక్కువగా వినియోగించే రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు మరో బుల్లెట్ ప్రూఫ్ కారైనా సెడాన్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. అంబానీ కుటుంబం పాత తరం ఎస్ క్లాస్ గార్డ్ కూడా కాన్వాయ్‌లో ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.