ఈ విశ్వంలో ఎన్నో వింతలూ విశేషాలు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడు ఆకాశంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వింతైన ఆకారాలు.. ఆకాశం ఒక్కసారిగా రంగుమారిపోవడం.. పట్టపగలే దట్టమైన మేఘాలు అల్లుకొని చిమ్మచీకటి కావడం.. ఆకాశంలో కాంతిపుంజాలు మెరవడం లాంటి జరుగుతుంటాయి.
అప్పుడప్పుడు ఆకాశంలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. విచిత్రమైన ఆకారాలు.. వెలుగులు కనిపించి మాయమవుతుంటాయి. అప్పుడప్పుడు వాతావరణంలో వింత మార్పులు ఏర్పడి ఆకాశం రంగులు మారుతుంటాయి. రాత్రి పూట తొక చుక్కలు రాలడం.. కొన్ని వింత కాంతులు స్థానికులను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా కాలీఫోర్నియాలో విచిత్రమైన కాంతులు ఒకదాని వెంట మరొకటి కదులుతూ వెళ్లాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో రాష్ట్రంలో గగనతలంలో వింతైన కాంతులు సందడి చేశాయి. ఉల్కా పాతం లాగా ఒకదాని వెంట మరొకటి వెలుగులు చిమ్మిస్తూ కాంతులు నింగిలో ప్రయాణించాయి. ఆ వెలుగులు దాదాపు 40 సెకండ్ల పాటు కనిపించి అదృశ్యం అయ్యాయి. రాత్రి పూట ఆ కాంతులు చూసిన వారు ఎలియన్స్ ప్రయాణిస్తున్నాయా అని భ్రమ చెందారు. శాక్రమెంటో సెయింట్ పాట్రిక్స్ డే జరుపుకుంటున్న ఓ వ్యక్తి ఆ కాంతులను ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వింత కాంతులను తాము ఎప్పుడూ చూడలేదని.. ఆకాశంలో అలా వరుసగా వెలుగులు చిమ్మిస్తూ వచ్చిన కాంతులను చూసి కొంత మంది భయపడిపోయారని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ వింత కాంతుల గురించి శాస్త్రవేత్తలు రక రకాలుగా చెబుతున్నారు. అంతరిక్షం నుంచి వచ్చి పడిన శకలాలు భూ వాతావరణంలో మండిపోవడం వల్ల ఇలాంటి కాంతి వెలుగు రూపంలో ఏర్పడి ఉంటాయని జోనథన్ మెక్ డోవేల్ అనే ఖగోళ శాస్త్రవేత అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి వెలుగు భూమిని తాకితే ప్రళయం వస్తుందని.. అంతరిక్షంలో ఉల్కలు ఇలా సందడి చేశాయని.. రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు 40 సెకండ్ల పాటు వచ్చిన ఈ కాంతి రహస్యం ఏంటా అన్నది అమెరికా ఖగోళ పరిశోధకులకు పెద్ద ప్రశ్నగా మారింది.