Scooter Number: కొందరికి ఫ్యాన్సీ నెంబర్లంటే భలే ఇష్టం. ఫ్యాన్సీ నెంబర్లు సొంతం చేసుకోవటానికి ఎంత ఖర్చయినా చేస్తుంటారు. సెలెబ్రిటీలలో కూడా ఫ్యాన్సీ నెంబర్లుకు మొగ్గుచూపే వారు లేకపోలేదు. మొబైల్ నెంబర్ దగ్గరినుంచి కారు నెంబర్ ప్లేటు వరకు ప్రతీ దానిలో ఫ్యాన్సీని కోరుకుంటుంటారు. టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోలు కొందరు లక్షలు ఖర్చుపెట్టి తమకు ఇష్టమైన నెంబర్లను కారు నెంబర్లుగా తెచ్చుకున్నారు. తాజాగా, చంఢీగఢ్‌కు చెందిన బ్రిజు మోహన్ అనే వ్యక్తి తన స్కూటీ నెంబర్ ప్లేటుకోసం ఏకంగా 15 లక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు. 71వేల రూపాయల స్కూటీ నెంబర్ ప్లేటు కోసం వేలం పాటలో పాల్గొని CH-01-0001 నెంబర్‌ను సొంతం చేసుకున్నాడు.
ఆ దెబ్బతో రాత్రికి రాత్రి సెలెబ్రిటీ అయిపోయాడు. స్కూటీకోసం 15 లక్షలు ఖర్చుపెట్టిన పిచ్చోడు ఎవరా అని దేశ మొత్తం తిరిగి చూసింది. తన కొచ్చిన ఫేమ్ చూసి మోహన్ ఎంతో మురిసిపోయాడు. అయితే, ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఓ స్కూటీ నెంబర్ ప్లేటు కోసం ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టిన మోహన్‌పై ఇన్‌కమ్ టాక్స్ దృష్టి సారించిందట. అంత డబ్బు అతడికి ఎక్కడిదా అని యోచిస్తోందంట. రైడ్ చేసే అవకాశం ఉందని తెలిసిన నేపథ్యంలో మోహన్ భయానికి గురయ్యాడని సమాచారం. అనవసరంగా లేని పోని తలనొప్పి తెచ్చుకున్నానన్న భావనలో ఉన్నాడంట.
ఈ నేపథ్యంలోనే ఆజ్ఞాతంలోకి వెళ్లాడని సమాచారం. అయితే, మోహన్ కుటుంబం బాగా స్థితిమంతుల కుటుంబంగా తెలుస్తోంది. అతడికి ఓ యాడ్ కంపెనీ కూడా ఉంది. మోహన్ ఇంకా మొత్తం డబ్బుల్ని ఆర్టీఓ అధికారులకు చెల్లించలేదు. ఇన్‌కమ్‌టాక్స్ రైడ్స్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ నెంబర్ ప్లేటు కోసం మొత్తం అమౌంట్‌ను కడతాడా?.. లేక డిపాజిట్ అమౌంట్ కట్టి ఊరుకుంటాడా? అన్నది తెలియరావాల్సి ఉంది. మరి, మోహన్ 15 లక్షలు ఖర్చు పెట్టి స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ కొనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.