అదృష్టం తలుపు తడితే మనిషి స్థితి గతలు ఒక్కసారిగా మారిపోతాయి. మనిషికి డబ్బు సంపాధించాలనే కసి ఎంత ముఖ్యమో లక్ కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అదృష్ట దేవత ఒక్క సారి కనికరిస్తే చాలు జీవితం మారిపోతుంది. అలా రాత్రికి రాత్రి స్టార్స్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తిని కూడా అదృష్ట దేవత తలుపు తట్టింది. దీంతో ఇప్పుడు ఓ మిడిల్‌క్లాస్ అబ్బాయి కాస్తా కోటీశ్వరుడు అయ్యాడు. దక్షిణ కాశ్మీర్ లోని బిజ్ బెహరా ప్రాంతానికి చెందిన వసీంరాజా ఆన్ లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11లో 2 కోట్ల రూపాయలు గెలుచుకోవడం ద్వారా రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు.
శనివారం రాత్రి తాను నిద్రపోతున్న సమయంలో కొంతమంది స్నేహితులు తనకు ఫోన్ చేసి డ్రీమ్ 11లో మొదటి స్థానంలో ఉన్నానని చెప్పారని, ఆ తర్వాత తాను 2 కోట్ల రూపాయలు గెలుచుకున్నాననే విషయాన్నీ తెలిపారని వసీం చెప్పారు. అప్పటికి తాను షాక్‌లో ఉన్నానని.. అందరు అలా చెప్పేసరికి చెక్ చేస్తే నిజమేనని తెలిపారు. ఈ విషయంపై మరిన్ని వివరాల కోసం క్రింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.