Man And Wild Boar: మనిషి విశ్వాసం చూపించటంలో నటన ఉంటుందేమో కానీ, జంతువులు అలా కాదు. నిజంగా ప్రేమిస్తాయి.. విశ్వాసం చూపిస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా వదిలి వెళ్లవు. ప్రాణం పోయే వరకు తనకు తిండి పెట్టిన వారిని అంటిపెట్టుకునే ఉంటాయి. మనిషి కూడా తనపై ప్రేమ, విశ్వాసం చూపిస్తున్న జంతువుపై తిరిగి అంతే ప్రేమ చూపిస్తే, స్నేహంగా మెలిగితే.. అది మహేంద్ర, రాజుల కథ అవుతుంది. ఈ కథలో మహేంద్ర ఓ మనిషి, రాజు ఓ అడవి పంది. వీరి మధ్య స్నేహం దాదాపు 20 ఏళ్లది. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల క్రితం ఓ సారి మల్కన్‌గిరిలో వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఓ అడవి పంది అడవిలోంచి కొట్టుకు వచ్చి జగన్నాథ్ మందిరం సమీపంలో నివాసం ఉంటున్న మహేంద్ర ఇంటి వద్ద ఉన్న కాలువలో పడింది.
చలికి గజగజా వణుకుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న దాన్ని మహేంద్ర చూశాడు. బయటకు తీసి, ఇంటికి తీసుకుకెళ్లాడు. ఆహారం అందించాడు. రక్షణ కల్పించి, తన దగ్గరే ఉంచుకున్నాడు. అది కొద్దిగా కోలుకున్న తర్వాత దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే అది చిన్న పిల్ల కావడంతో అతని వద్దే క్షేమంగా ఉంటుందని భావించిన సిబ్బంది.. తిరిగి అడవిలోకి పంపించేందుకు నిరాకరించారు. దీంతో మహేంద్ర దాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయాడు.
అప్పటి నుంచి ఇంట్లో మనిషిలాగే పెంచి, పెద్ద చేశాడు. దానికి రాజు అని పేరు కూడా పెట్టాడు. మహేంద్ర అంటే దానికి ఎంతో ప్రేమ, అభిమానం. ఎంతో విశ్వాసం చూపిస్తుంది. అతడు చెప్పినట్లు చేస్తుంది. రెండు సార్లు అడవిలో వదిలిపెట్టినా ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో మహేంద్ర దానిపై మరింత ప్రేమ పెంచుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల నుంచి రాజు ఎవ్వరికీ ఏ హానీ తలపెట్టలేదు. అందరితో మంచిగా ఉంటుంది. జనం సైతం దానితో గడపటానికి వస్తుంటారు. రాజు ఆహారం కోసం అడివిలోకి వెళ్లినా సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తుంది. రాత్రి వేళ మహేంద్రను వదిలి ఉండదు. మరి, మహేంద్ర, రాజుల స్నేహంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Police: పోలీస్ స్టేషన్ కి తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు! ఎందుకంటే.