పెళ్లంటే నూరేళ్ల అనుబంధం. పెద్దల సమక్షంలో.. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారు వధూవరులు. నూరేళ్ల ఒకరికొకరు తోడూ నీడగా కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. ఇటీవల పెళ్లి రోజు వేడుకలు చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.
ఈ మద్య చాలా మంది పెళ్లి వేడుకలు, పుట్టిన రోజు కార్యక్రమాలు, పెళ్లి రోజు చాలా గ్రాండ్ గా వెరైటీగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమవాళ్ల కోసం జీవితాంతం గుర్తుండిపోయేలా బహుమతులు ఇస్తున్నారు. మనం సాధారణంగా ఏదైనా ఫంక్షన్స్ కు వెళితే ఫంక్షన్ లో బహుమతులు తీసుకెళతాం. గృహప్రవేశం, బర్త్ డే పార్టీలు, పెళ్లిరోజు వేడుకలకు వెళ్లినపుడు గిఫ్ట్ లు ఇస్తాం. కొందరు వారి ప్రేమను వ్యక్త పరుచుటకు వినూత్నంగా అరుదైన కానుకలు ఇచ్చి వారి మనసును గెలుచుకుంటారు. అలాంటిదే లో సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఓ భర్త భార్యకు పెళ్లిరోజు కానుకగా ఏకంగా చంద్రునిపై స్థలం కొని అందరిని ఆశ్చర్యపరిచాడు. వివరాలలోకి వెళితే..
మధ్య ప్రదేశ్ కి దార్ ప్రాంతానికి చెందిన కపిల్ అనే వ్యక్తికి తన భార్య అంటే ఎంతో ప్రేమ. తమ 18వ పెళ్లిరోజు సందర్భంగా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక బహుమతి ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ట్యాక్స్ అడ్వజైర్ గా పనిచేస్తున్న కపిల్ తన భార్య కోసం ఎవరూ ఊహించని బహుమతి ఇచ్చాడు. ఇంతకీ ఆ బహుమతి ఏంటా అనుకుంటున్నారా? చంద్రునిపై స్థలం కొని బహుమతిగా ఇచ్చాడు. అదేలా సాధ్యమైందని అనుకుంటున్నారా? మనసు పెడితే ఇది మనకు కూడా సాధ్యమేనండీ.. అదేలాగో చూద్దాం..
అమెరికాకు చెందిన లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ మాత్రమే చంద్రునిపై లూనార్ ల్యాండ్ అథారిటీ ద్వారా స్థలం అమ్ముతుందని గుర్తించాడు. వెంటనే వారిని మెయిల్ ద్వారా సంప్రదించాడు. ప్రస్తుతం చంద్రుడిపై ఒక ఎకరా స్థలం ధర సుమారు రూ.3,430 ఉంది. ఇటీవల కొంతమంది చంద్రునిపై స్థలం కొనే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి నివసించే ఉద్దేశ్యం లేకపోయినా కూడా కొందరు కొనుక్కుంటున్నారు. కపిల్ కూడా చంద్రునిపై స్థలం కొనగానే ఆన్ లైన్ లో మ్యాప్ వచ్చింది. తన భార్యకు సమ్ థింగ్ స్పెషల్ గా ఈ బహుబతి ఇవ్వాలన్న కోరిక నెరవేర్చుకున్నాడు.
దీనితో కపిల్ స్పందిస్తూ.. ‘నేను నా భార్యకు చుక్కలు తెస్తానని మాట ఇచ్చాను. అది నిలబెట్టుకోలేదు. కానీ చందమామపై స్థలాన్ని మాత్రం గిఫ్ట్ గా ఇవ్వగలిగాను. నా చందమామకు ఆ చందమామ కానుక’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇది ప్రస్తుతం నట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కపిల్ భార్య శిఖా మహేశ్వరి చంద్రునిపై స్థలం తనకు దక్కిందన్న సంతోషం వ్యక్తం చేసింది.ఇలాంటి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినందుకు భర్తకు కృతజ్ఞతలు తెలిపింది. తమ 18వ పెళ్లిరోజు ఈ కానుక రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. కపిల్ తన భార్య శిఖా మహేశ్వరికి ఇచ్చిన కానుకపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.