చిన్న పిల్లలు చేసే పనులు అప్పుడుప్పుడు ఎంతో ముద్దు అనిపిస్తుంటాయి. చిన్న పిల్లలకు మంచీ చెడూ అనేది ఏదీ తెలియదు.. వారి మనసు చాలా సున్నితమైనది. చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా, వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెద్దలు ఎంతో గారాబంగా పెంచుకుంటారు. చిన్న పిల్లలకు చిన్నతనంలో ఉన్న కోడి పిల్లలు, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కనిపిస్తే పండగే పండుగ. వాటితో మైమరచిపోయి ఆడుకుంటారు.
అప్పడప్పుడు చిన్న పిల్లలు చేసే పనులు చూసి షాక్ అవుతుంటారు. బయట ఆడుకుంటూ వెళ్లిన పిల్లలకు తమకు దొరికింది ఏదైనా ఇంటికి తెస్తుంటారు. ఓ చిన్నారి బయట ఆడుకుంటూ వెళ్లి ఇంటికి పిల్లి పిల్ల అనుకొని ఏకంగా చిరుత పిల్లను తీసుకు వచ్చింది. అలా చిన్నారి చేసిన పనికి కుటుంబ సభ్యులకు గుండె గుభేల్ మంది. కాకపోతే ఆ చిరుత పిల్ల రోజుల వయసుది కనుక ఎవరినీ ఏమీ చేయలేదు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమ పాప ఈ మద్య ఒక చిన్న పిల్ల కూనను తీసుకు వచ్చింది. దాన్ని అందరం ఇంట్లో ఎంతో ముద్దుగా చూసుకుంటున్నామని పాప తల్లి తెలిపింది. తర్వాత తెలిసింది అది చిరుత పిల్ల అని.. దానికి రోజుకీ లీటరు పాలు పోస్తూ వచ్చామని, తల్లి చిరుత జాడ కోసం తామంతా భయం భయంగా ఎదురు చూస్తుంటే, తమ పాప మాత్రం చిరుత కూనతో ఎంతో సరదాగా ఆడుకుందని చిన్నారి కుటుంబ సభ్యులు అన్నారు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారికి సమాచారం అందించారు. అటవీశాఖ వారు వచ్చి ఆ చిరుత కూనను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.