ప్రస్తుత సమాజంలో ప్రేమ వ్యవహరాలు పెరిగిపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడటం.. ఆ భ్రమలో పడి భవిష్యత్తును పాడు చేసుకునే వారు కొందరైతే.. ప్రేమను అంగీకరించకపోతే.. దారుణాలకు పాల్పడేవారు మరికొందరు. అమ్మాయిల వెంట పడటం.. వారు అంగీకరించకపోతే.. ప్రాణాలు తీయడం వంటి సంఘటనలు ప్రసుత్తం నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. శనివారం మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన దర్యాప్తులో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ ప్రమాదం వెనక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యువతి తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో.. ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఆ వివరాలు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం.. విజయ్ నగర్ ప్రాంతంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఆ బిల్డింగ్‌లో ఉంటోన్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో శుభం దీక్షిత్ (27) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. ప్రస్తుతం అతడి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్ని ప్రమాద ఘటనలో మూడంతస్థుల భవనం కాలి బూడిదవ్వగా.. ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఎలక్ట్రిక్ మీటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పార్క్ చేసిన వాహనాలకు అంటుకుని ఆపై భవనానికి పాకినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ అక్కడ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది.
ఇది కూడా చదండి: ఆ ఊరిలో 55 ఏళ్ళకి మించి మనుషులు బతకడం లేదు! కారణం?
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. దీనిలో ఓ యువకుడు శనివారం తెల్లవారుజామున భవనం దగ్గరకు వెళ్లి అక్కడ పార్క్ చేసి ఉన్న ఓ స్కూటర్‌కు నిప్పు పెట్టాడు. దాంతో మంటలు వ్యాపించి భవనాన్ని చుట్టుముట్టాయి. దీంతో కొంతమంది తమ ఫ్లాట్‌ల బాల్కనీల నుంచి కిందకు దూకి తమను తాము రక్షించుకున్నారు. దాంతో చాలామంది గాయాలపాలయ్యారు. ఆ తర్వాత పోలీసులు సదరు యువకుడి గురించి ఆరా తీయగా ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు యువకుడుని శుభం దీక్షిత్‌గా గుర్తించారు పోలీసులు. అతడు బిల్డింగ్‌లో ఉంటున్న ఓ యువతిని ప్రేమించాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో.. పగ పెంచుకున్న శుభం దీక్షిత్ ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: కర్నూలు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం! మంటల్లో చిక్కుకున్న 5 ఏళ్ల చిన్నారి!
#UPDATE | Seven people died in the fire that broke out in a two-storey building in Indore, Madhya Pradesh: Indore Police Commissioner Harinarayana Chari Mishra to ANI
Latest visuals from the spot. pic.twitter.com/E6wXhytkl3
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 7, 2022
అయితే వాహనానికి నిప్పు పెట్టిన దీక్షిత్ గంట తర్వాత మళ్లీ అక్కడకు వచ్చి సీసీ టీవీలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. అది వీలుకాకపోవడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. నిందితుడు కోసం పోలీసులు గాలించి అరెస్ట్ చేసినట్టు ఆదివారం ఒక అధికారి తెలిపారు. తీ ఆ దీక్షిత్ ప్రేమించిన అమ్మాయి సురక్షితంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Money: కాలువలో కొట్టుకు వచ్చిన రూ.2000 నోట్ల కట్టలు!
इंदौर अग्निकांड का आरोपित गिरफ्तार, टीवी पर न्यूज देखकर चौका,बोला बहुत बड़ा कांड कर डाला https://t.co/yWjKw7HOlw#IndoreFire #Indore #MadhyaPradesh #MPNews pic.twitter.com/saPzBV9gds
— NaiDunia (@Nai_Dunia) May 8, 2022