ఈ మద్య వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విమానం టేకాఫ్ అయి సురక్షితంగా గమ్యస్థానం చేరేంద వరకు ప్రయాణీకులకు టెన్షన్ లో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాంకేతిక లోపాలు.. వాతావరణ సమస్యలు.. పక్షలు ఢీ కొనడం లాంటి ఘటనలతో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్ ని ఓ పక్షి బలంగా ఢీ కొట్టడంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లలీలో ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. వివరాల్లోకి వెళితే..
న్యూ ఢిల్లీ నుంచి బెంగుళూరు కి బయలు దేరుతున్న ఇండిగో విమానం ఇంజన్ లో ఒక్కసారే మంటలు చెలరేగాయి. ఇంజన్ లో ఒక్కసారే మంటలు చెలరేగిన విషయం గుర్తించిన పైలెట్ అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. వెంటనే విమానం నుంచి ప్రయాణీకులను, సిబ్బందిని కిందకు దింపేశారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఉన్నవారు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఇండిగో విమానం బయలు దేరే సమయంలో అందులో మొత్తం 184 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రన్ వే పై విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజన్ లో మంటలు రావడతో… పొగలు వచ్చాయి. విమానంలో కిటికీ వద్ద కూర్చున్న ప్రయాణీకులు ఒక్కసారే భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం గమనించి పైలెట్ వెంటనే ల్యాండింగ్ చేయడంతో అందరూ బతుకు జీవుడా అనుకున్నారు. ప్రయాణీకులను ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి పంపించారు.
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో చెలరేగిన మంటలను గుర్తించిన వెనక ఉన్న స్పైస్‌జెట్ విమాన పైలట్ అధికారులకు సమాచారమిచ్చి, అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. pic.twitter.com/oq3IajCADq
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 29, 2022