Indian Railways: చాలా వరకూ ప్రయాణికులు సుఖ ప్రయాణం కోరుకుంటున్నారు. డబ్బు ఎక్కువ ఖర్చైనా గానీ జర్నీ అద్భుతంగా ఉండాలని భావిస్తున్నారు. అది బస్సు ప్రయాణమైనా, రైలు ప్రయాణమైనా, ఇంకే ప్రయాణమైనా గా. జీవితంలో నలిగిపోతున్నాం, ప్రయాణంలో నలిగిపోవడం అవసరమా అని ఆలోచించి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డబ్బు విషయంలో వెనుకడుగు వేయడం లేదు. ఐతే అందరూ తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోలేరు. కొందరు అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీరిలో కొంతమంది బస్సుల్లో వెళ్ళాలని అనుకోగా, మరి కొంతమంది రైళ్ళలో వెళ్ళాలని అనుకుంటారు. రైళ్లలో వెళ్లాలనుకునేవారికి అప్పటికప్పుడు టికెట్లు అంటే దొరకడం కష్టమే. కాబట్టి తత్కాల్‌లో బుక్ చేసుకుంటారు. సీటు దొరికితే అదృష్టం. దొరక్కపోతే ఇక అంతే సంగతులు. అదే ప్రీమియం తత్కాల్‌లో బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ ఉండదు. బెర్త్ కూడా బెర్త్ కూడా దొరుకుతుంది. కాకపోతే తత్కాల్‌తో పోలిస్తే ధర ఎక్కువే. తత్కాల్ టికెట్ల ధర మీద 10 నుంచి 30 శాతం అధికంగా ఉంటుంది.
అయినప్పటికీ భరించే వారికి ఈ ధర పెద్ద సమస్య కాదు. ధర ఎలా ఉన్నా గానీ ఈ సేవలు ఇంకా ఎక్కువగా అందుబాటులోకి రావాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అందుకే భారతీయ రైల్వే సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ కేవలం 80 ట్రైన్లకు మాత్రమే ప్రీమియం తత్కాల్ సేవలను అందిస్తున్న ఇండియన్ రైల్వేస్.. ఇక నుండి అన్ని రైళ్ళకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ప్రయాణికులకు ఉన్న అవసరం రీత్యా ఈ సేవలను అన్ని రైళ్ళకూ వర్తింపజేయాలని చూస్తుంది. ఇక నుండి అన్ని ట్రైన్ టికెట్ బుకింగ్స్‌లోనూ ఈ సేవలు లభ్యం కానున్నాయి. అంతేకాదు ప్రీమియం తత్కాల్ స్కీమ్ కింద రైలులో కొన్ని సీట్లను మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంచిన ఇండియన్ రైల్వేస్.. ఇక నుండి ఎక్కువ సీట్లను కేటాయించేందుకు సిద్ధమవుతోంది. చివరి నిమిషంలో టికెట్లు బుక్ చేసుకునేవారికిది శుభవార్తే. మరి ప్రీమియం తత్కాల్ సేవలను అన్ని రైళ్ళలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఇండియన్ రైల్వేస్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.