నేటి సమాజంలో తల్లిదండ్రులు తర్వాత మనం ఎక్కువగా కీర్తించేది ఒక చదువు నేర్పిన గురువులను మాత్రమే. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు ఉపాధ్యాయులు మచ్చతెస్తుంటే కేరళలోని ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు మాత్రం శత్రువుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. అసలు ఈ టీచర్ చేసిన ఘనకార్యమేంటీ? తన సొంత నగలు అమ్ముకుని మరీ స్కూల్ విద్యార్థులకు ఏం చేసిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
టీచర్ పేరు అన్నపూర్ణ మోహన్.. తమిళనాడులోని పంచాయతీ యూనియన్ ప్రైమరీ స్కూల్ కందాడులోని ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఆమె టీచర్ గా విధులను నిర్వహిస్తోంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి తరం పిల్లలు మూడవ తరగతి నుంచే ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. దీంతో మా పిల్లలు కూడా ప్రైవేట్ పిల్లల మాదిరిగా ఇంగ్లీష్ లో మాట్లాడాలంటూ కలలు కనేది. అయితే అన్నపూర్ణ మోహన్ కలల అనుగుణంగానే అంతర్జాతీయ పాఠశాలల్లో బోధించే స్థాయిలో తమ పిల్లలకు ఈ టీచర్ పాఠాలు భోదిస్తూ ముందుకు వెళ్తోంది.
ఇక కార్పొరేట్ స్థాయిలో రాణించాలంటే దానికి తగ్గ వసతులు లేవని అన్నపూర్ణ మోహన్ అప్పడప్పుడు బాధపడుతూ ఉండేది. అయితే ఇలాంటి క్రమంలో తమ స్కూల్లో తగిన స్థాయిలో సౌకర్యాలు కల్పించుకునేందుకు ఏకంగా తన సొంత నగలు సైతం అమ్ముకుని పిల్లలకు పాఠాలు చెబుతోందీ టీచర్. స్కూల్‌లో అధునాతన డిజిటల్ సిస్టమ్, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు అవసరమయ్యే డిజిటల్ పరికరాలన్నిటిని సమకూర్చింది.
దీంతో పిల్లలకు రోజు ఇంగ్లీష్ లో పాటలు, పద్యాలు నేర్పుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఉండేది. ఇక ఈ వీడియోలు చూసిన కొందరు అన్నపూర్ణ మోహన్ సేవలను కొనియాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వేళలకు రానటువంటి ఉపాధ్యాయులున్న ఈ కాలంలో అన్నపూర్ణ మోహన్ పిల్లలపై చూపిస్తున్న ఇంతటి శ్రద్దపై సలాం చేస్తున్నారు. ఇక పిల్లల చదువుల కోసం ఏకంగా తన సొంత నగలు అమ్మిన అన్నపూర్ణ మోహన్ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.