ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర ప్రమాదాల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ఆరు అంతస్తుల హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అందులోని వారు భయంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు.
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర ప్రమాదాల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే కాలిన గాయాలతో చాలా మంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవలే సికింద్రాబాద్ ప్రాంతంలోని స్వప్న కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించి.. ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే ఇండోర్ పట్టణంలోని ఓ ఆరు అంతస్తుల హోటల్ లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పట్టణంలోని పాప్పాయి ట్రీ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుందని అధికారులు, హోటల్ సిబ్బంది తెలిపారు. తెల్లవారు జామున అకస్మాత్తుగా వచ్చిన మంటలను హోటల్ సిబ్బంది గుర్తించారు. ఎగిసిపడిన మంటలను సిబ్బంది ఆర్పేందుకు తీవ్రంగా కృషి చేశారు. అయినా మంటలు నియంత్రణలోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచినట్లు తెలుస్తోంది.
అయితే హోటల్లో ఉన్న అతిథులు భయాందోళనకు గురై పెద్ద కేకలు వేశారు. హోటల్ సిబ్బంది అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మటంలు ఆర్పే ప్రయత్నం చేశారు. అలానే రెస్క్యూ సిబ్బంది హోటల్లో చిక్కుపోయిన వారిని నిచ్చెన, బెడ్ షీట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెస్క్యూ టీమ్ కాపాడిన వారిలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు.
పొగ కారణంగా హోటల్ లో ఉన్న వాళ్లు చాలా భయపడ్డారని ఇండోర్ సీనియర్ పోలీసు అధికారి ఆర్ఎస్ నింగ్వాల్ తెలిపారు. అలానే హోటల్ పరిసర ప్రాంతంలోని ఆకాశం దట్టమైన పొగతో నిండిపోయింది. స్థానిక ప్రజలకు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మరి.. బహుళ అంతస్తుల భవనాల్లోనే తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fire at a multi-storeyed hotel in Rau area of Indore was triggered possibly from hotel’s kitchen this morning. Fire brigade and SDERF personnel evacuated 35 plus staff and guests, many of them through the windows. @NewIndianXpress @TheMornStandard @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/gQAtXV7wOR
— Anuraag Singh (@anuraag_niebpl) March 29, 2023