దేశంలో కొంతకాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడ అక్కడ రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు బలి అవుతున్నారు. ఎవరో చేసిన చిన్న పొరపాటుకు కుటుంబ పెద్దని కోల్పోయి ఎన్నో కుటుంబాలు విధిన పడుతున్నాయి.
ఈ మద్య దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగూతనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. ఇలా కారణాలు ఏవైనా ప్రమాదాలో ఎంతో మంది అమాయకులు చనిపోతున్నారు. ఇంటి పెద్దను కోల్పోకి అనేక కుటుంబాల రోడ్డున పడుతున్నారు. ఎంతోమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వాహనాలు నడిపేసమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటుంటారు. ఓ వ్యక్తి రోడ్డుపై ఎవరైనా ద్విచక్ర వాహనదారుడు హెల్మెల్ ధరించి లేకుంటే వారిని ఆపి కొత్త హెల్మెల్ అందించి జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తుంటాడు.. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏ ప్రాంతం అనే విషయం గురించి తెలుసుకుందాం…
మనిషి కొన్ని సంఘటనలు జీవితంలో మర్చిపోలేడు.. ఆ సంఘటనలు తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. అలాంటి సమయంలో కొన్నిసార్లు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హై వేపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఓ వ్యక్తి మీ వాహనాలకు అడ్డుపడతారు. ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పి కొత్త హెల్మెట్ ఇచ్చి మీ జర్నీ ప్రశాంతంగా సాగాలని కోరుకుంటాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా? ఆయన పేరు రాఘవేంద్ర కుమార్. బీహార్ రాష్ట్రానికి చెందిన రాఘవేంద్ర కొంతకాలంగా నిస్వార్థమైన సేవ అందిస్తూ వస్తున్నారు. అయితే రాఘవేంద్ర ఇలా హెల్మెట్ పంచడానికి ఓ బలమైన కారణం ఉంది.
ఒకసారి రాఘవేంద్ర కుమార్ స్నేహితుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. యుమునా ఎక్స్ ప్రెస్ హైవే పై వెళ్తున్న సమయంలో ఓ ట్యాంకర్ వచ్చి ఢీ కొట్టింది. ఆ సమయంలో అతడు హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన దెబ్బ తగిలి చనిపోయాడు. తన స్నేహితుడు హెల్మెట్ లేకపోవడం వల్లనే చనిపోయాడని తీవ్రంగా బాధపడ్డ రాఘవేంద్ర కుమార్ అప్పటి నుంచి ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన స్నేహితుడిలా ఎవరూ బలికావొద్దని తొమ్మిదేళ్ల నుంచి రాఘవేంద్ర ఉచిత హెల్మెట్ పంపిణీ మొదలు పెట్టాడు. హైవే పై హెల్మెట్ లేనిది గమనించి వాళ్లను వెంబడించి మరీ ఇస్తుంటాడు.
ఇప్పటి వరకు రాఘవేంద్ర కుమార్ ఏకంగా 56,000 హెల్మెట్లు అది కూడా బీఐఎస్ మార్క్ ఉన్న నాణ్యమైన హెల్మెట్లను పంచుకుంటూ వచ్చాడు. కొత్తలో రాఘవేంద్ర చేస్తున్న పనికి కొంతమంది డబ్బు ఎక్కువై ఇలా చేస్తున్నాడని విమర్శించినా.. తర్వాత అతడు చేస్తున్న గొప్ప పనిని అందరూ అభినందించారు. రాఘవేంద్ర సేవ చేయాలనే దృఢ సంకలం ఎంత గొప్పదంటే.. హెల్మెట్లు ఉచితంగా ఇచ్చేందుకు ఏకంగా తన ఫ్లాట్, భార్య మెడపై ఉన్న కొన్ని నగలు అమ్మి, కుదవ పెట్టి మరీ పంచాడు. ఈ కాలంలో సొంతవారినే ఎవరూ పట్టించుకోరు.. అలాంటిది ఇతరుల క్షేమం కోసం చేస్తున్న మంచి పనికి రాఘవేంద్రను విషయం తెలిసి దేశమంతా మెచ్చుకుంటుంది. ఈ విషయం తెలిసిన కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, నటుడు సోనూసూద్ లాంటివారు రాఘవేంద్రను చేస్తున్న సేవలను ప్రశంసించారు. అందరికీ హెల్మెట్ పంచుతూ వస్తున్న రాఘవేంద్రను హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అని పిలుస్తారు.