సహజంగా పెళ్లి అంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ఇక ఇండియాలాంటి విశాల దేశంలో భిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఆచరణలో ఉంటాయి. దేశమంతా ఏడాది పొడవునా ఏదో ఓ చోట ఏదో ఓ వేడుక- జరుగుతూనే ఉంటాయి. ఇక మన సమాజంలో వివాహ వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. పేదల నుంచి పెద్దల వరకు ప్రతి ఇంట వివాహ వేడుకను తమకు ఉన్నంతలో ఘనంగా నిర్వహిస్తారు. ఇక వివాహం అంటే అనేక సంప్రదాయాలు పాటించాల్సి వస్తుంది. అది కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఇక కొన్ని తెగల్లో వింత వింత ఆచారాలుంటాయి. ఇప్పుడు ఈ కోవకు చెందిన ఆసక్తికర ఆచారం గురించి మీకు చెప్పబోతున్నాం. అదేంటంటే.. ఓ ప్రాంతంలో అబ్బాయిలకు గడ్డం ఉంటే పెళ్లి కాదు. గడ్డం ఉంటే ఏం ఇబ్బంది.. పెళ్లికి ఎలా అడ్డం అవుతుంది.. అసలు ఈ గడ్డం కథ ఏంటో తెలియాలంటే.. ఇది చదవండి.
గుజరాత్‌లోని పాలి జిల్లాలో ఈ వింత రూల్ అమల్లోకి వచ్చింది. ఆ ప్రాంత పెద్దలంతా కలిసి ఒక కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చారు. ఇకపై తమ ఊర్లలో జరిగే పెళ్లిల్లలో వరుడు తప్పకుండా క్లీన్ షేవ్ చేసుకోవాలనే రూల్ పెట్టారు. పెళ్లి కొడుకు గడ్డంతో ఉంటే పెళ్లికి అనుమతి ఇవ్వబోమని తేల్చేశారు. అంతేకాదు, పెళ్లిలో డీజేలు, డ్యాన్సులంటూ చిందులేస్తే సహించబోమని కూడా చెప్పేశారు. 19 గ్రామాలకు చెందిన కుమావత్ కమ్యునిటీ పెద్దలంతా కూర్చొని ఈ రూల్స్ రూపొందించారు.
ఇది కూడా చదవండి: Video: రెప్పపాటులో.. సైకిల్ పై వెళుతున్న వ్యక్తిపై చిరుత దాడి!
‘‘పెళ్లిలో ఫ్యాషన్ ఓకే. కానీ, ఫ్యాషన్ పేరుతో వరుడు గడ్డంతో పెళ్లి చేసుకుంటే మాత్రం అంగీకరించం. పెళ్లి అనేది మత సంప్రాదాయానికి ప్రతీక. వరుడిని రాజులా చూస్తారు. అందుకే, అతడు గడ్డంతో కాకుండా క్లీన్ షేవ్‌తో చక్కగా కనిపించాలి’’ అని పెద్దలు రూపొందించిన తీర్మానంలో పేర్కొన్నారు. పెళ్లి కోసం భారీ ఖర్చు పెట్టకూడదని, తక్కువ ఖర్చుతోనే పెళ్లి చేయాలని పెద్దలు వెల్లడించారు. డీజే డ్యాన్సులు కూడా చేయొద్దని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఫోటో కొట్టు.. రూ.500 రివార్డు పట్టు.. రాంగ్ పార్కింగ్‌పై త్వరలో కొత్త చట్టం!
ఎవరైనా ఫ్యాషన్ పేరుతో థీమ్ ప్రకారం డెకరేషన్లు చేసినా, దుస్తులు, హల్దీ వేడుకలంటూ విపరీతంగా ఖర్చు చేసినా జరిమానా విధిస్తారు. పాలీ జిల్లాలోని ప్రతి గ్రామ ప్రజలు ఈ నిబంధన పాటించాలి. పాలీలోని 19 గ్రామాల నుంచి గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలకు వలస వెళ్లిన గ్రామస్తులు కూడా ఈ నిబంధనలు పాటించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. దీనిపై ఆ 19 గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రైల్వేలో పనిచేస్తున్న తండ్రి, కొడుకు.. వెళ్తున్న రైళ్లలో నుండి సెల్ఫీ!