ఆశ పడటం లేదు తప్పు లేదు కానీ, అత్యాశ పడటమే తప్పు. ఈ పెళ్లి కొడుకు అలాంటి ప్రయత్నమే చేశాడు. అక్కతో పెళ్ళికి సరే అని చెల్లిని లైన్ లో పెట్టాడు. పోనీ ఆ విషయాన్ని బయటపెట్టాడా! అదీ లేదు. పెళ్లయ్యాక 'Buy 1 Get 1' ఆఫర్ లా ఎంజాయ్ చేయొచ్చులే అనుకొని పెళ్ళిపీటల మీద కూర్చున్నాడు. కానీ మరదలు పిల్ల అడ్డుపడడంతో ఇతగాడి లీలలు బయటపడ్డాయి.
‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా..‘ అన్నట్లు పెళ్లి కొడుకుల యందు ఇతగాడు వేరు. ఎంత వేరు కాకపోతే.. అక్కతో పెళ్ళికి సరే అని చెల్లిని లైన్ లో పెడతాడు చెప్పండి. పోనీ ఆ విషయాన్ని బయటపెట్టాడా! అదీ లేదు. పెళ్లయ్యాక ‘Buy 1 Get 1’ ఆఫర్ లా ఎంజాయ్ చేయొచ్చులే అనుకొని పెళ్ళిపీటల మీద కూర్చున్నాడు. కానీ మరదలు పిల్ల అడ్డుపడడంతో ఇతగాడి లీలలు బయటపడ్డాయి. అది కూడా సినిమా స్టయిల్ లో ఈ పెళ్లి ఆగడం గమనార్హం. వధువులు చెల్లెలు.. ‘అక్కకు అతనితో పెళ్లి జరగడానికి వీల్లేదు.. అతనితో నా పెళ్లి జరగాలి..’ అంటూ సినిమా డైలాగులు చెప్పి పెళ్లి ఆపించింది.
బీహార్ రాష్ట్రం ఛప్రా పరిధిలోని రాజేష్ అనే వ్యక్తికి, అదే ప్రాంతానికి చెందిన రింకూ అనే యువతికి గతేడాది నిశ్చితార్థం జరిగింది. వధువైన రింకూకు పుతుల్ అనే ఓ చెల్లి కూడా ఉంది. నిశ్చితార్థం జరిగిన తరువాత వరుడి కుటుంబానికి, వధువు కుటుంబానికి మధ్య చనువు బాగా పెరిగింది. ఈ క్రమంలో రాజేష్ తరచుగా రింకూ ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఇలా వస్తూ వస్తూ రింకూ చెల్లి పుతుల్ కు ఇతగాడికి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. దీనిని కుటుంబసభ్యులు బాద్యత అనుకున్నారు. కానీ వీరిద్దరూ మాత్రం ఒకరంటే మరొకరికి ఇష్టమని చెప్పుకొని.. చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. అయితే ఈ విషయాన్ని బయటకు తెలియకుండా దాచిపెట్టారు.
ఇలా సాఫీగా సాగిపోతున్న వీరి ప్రయాణానికి పెళ్లి రోజు అడ్డుపడింది. ఈ నెల 2న వరుడు రాజేష్ పెళ్ళివేడుక కోసం తన కుటుంబంతో కలసి ఊరేగింపుగా రింకూ ఇంటికి చేరుకున్నాడు. రింకూ కుటుంబసభ్యులు.. ఇంటి అల్లుడిని మేళతాళాల మధ్య మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. మరోరెండడుగులు వేస్తే ఇంట్లోకి అడుగు పెడతాడు అనుకుంటుండగా.. వధువు చెల్లెలు పుతుల్ అరవడం మొదలుపెట్టింది. ఈ పెళ్లి ఆపండి అంటూ గట్టిగా అరిచింది. ఆమె సరదాకు అంటోందని ఎవరూ పట్టించుకోలేదు. కాసేపు అయ్యాక మళ్ళీ.. ‘రాజేష్ తో అక్కకు పెళ్లి జరిపించకండి.. అతడిని నేను మనవాడాలి..’ అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆమె అల్లరిచేస్తోందేమోనని కుటుంబసభ్యులు.. ‘సరదాకు ఓ హద్దు ఉంటుంది.. ఈ సమయంలో ఇలా మాట్లాడొచ్చా..’ సర్థిచేప్పే ప్రయత్నం చూశారు.
ఇక తన మాట ఎవరూ వినరనుకున్నా పుతుల్.. అక్కడినుండి ఇంటి పైకి పరుగుతీసింది. ‘రాజేష్ తో నాకు పెళ్లి జరిపించకపోతే పైనుండి దూకి చచ్చిపోతాను’ అంటూ బెదిరించడం మొదలు పెట్టింది. అప్పటికీ వరుడు నోరు మొదపట్లేదు. అక్కడ ఏం జరుగుతోందో అర్థం అవ్వడం లేదు అన్నట్లుగా బిక్కమొహం వేశాడు. చెల్లెలి డిమాండ్ కు సరే అన్న వధువు రింకూ.. ‘ఎందుకిలా అడుగుతున్నావు అని చెల్లిని ప్రశ్నించడంతో వీరి మధ్య సాగిన ప్రేమ వ్యవహారం బయటపడింది. ఇక చేసేదేమి లేక రింకూ కుటుంబసభ్యులు.. ముందు పెట్టుకున్న ముహూర్తానికే రాజేష్ కు పుతుల్ కు వివాహం జరిపించారు. ఈ గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు వారికి నచ్చ చెప్పి అక్కడినుండి పంపేశారు. చూశారుగా.. ఈ వరుడి కక్కుర్తి. మీరు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేయకండి.