రెండు తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ గవర్నర్ నరసింహన్ ఆనారోగ్య పాలైనట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికత్స తీసుకుంటున్నారట. గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికత్స అందిస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
కాగా గవర్నర్ ఆస్పత్రిలో ఉన్నాడన్న విషయం తెలియడంతో హుటాహుటిన నరసింహన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటు చికిత్స అందిస్తున్న వైద్యుల నుంచి నరసింహన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. ఇక చెన్నై పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు నటుడు కమల్ హసన్ ను కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు.