పక్షులు, జంతువులు పెంచుకోవడం అంటే అందరకి ఎంతో సరదానే. కొందరైతే వాటిని వదిలి క్షణం కూడా ఉండలేరు. ఎటైనా వెళ్తున్నారంటే వాటిని కూడా వెంట బెట్టుకెళ్లాల్సిందే. ఈ మద్య పక్షులు, జంతువులకు పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అవి కనిపించకుండా పోతే తమ కుటుంబ సభ్యులు మిస్ అయినంతగా బాధపడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరుకు చెందిన ఓ కుటుంబం కూడా తమ పెంపుడు చిలుక కోసం ఇలానే ఆరాటపడిపోతున్నారు. తమ చిలుక కనిపించకుండా పోయిందని.. ఆచూకీ తెలిపితే బహుమతి ఇస్తామని పోస్టర్లు వేశారు. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో నివసిస్తున్న రవి అనే వ్యక్తి పక్షులు, జంతువులు అంటే ఎంతో ప్రాణం. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన ఆఫ్రికా కు చెందిన రెండు చిలకలను పెంచుకుంటున్నాడు. అందులో ఒక చిలుక జూలై 16 న అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో రవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదన చెందారు. అప్పటి వరకు తమ ముందు ముద్దు ముద్దుగా చిలక పలుకులు పలికిన రుస్తుమా అనే చిలుక జాడ కోసం అన్ని చోట్ల వెతికారు.
తన స్నేహితులకు, బంధువులకు చిలుక ఫోటో పంపించడంతో పాటుగా చిలుక బొమ్మతో ఓ పోస్టర్ కూడా వేయించి చుట్టుపక్కల అంటించాడు. అంతే కాదు తన చిలుకను పట్టి ఇచ్చిన వారికి రూ.50 బహుమతి కూడా ఇస్తానని తెలిపాడు రవి. ఆ చిలుక అంటే తమ కుటుంబ సభ్యులకు ఎంతో ప్రాణం అని.. అది కనిపించకుండా పోవడంతో తాము ఎంతో బాధపడుతున్నామని రవి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Brimato: టమాటా లాంటి వంకాయని చూశారా? అదికూడా టమాటా చెట్టుకే!