రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. రైతు సంక్షేమం కోసం పలు స్కీములు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ప్రభుత్వ సహాయం అందించడానికి, పంటల దిగుబడిని పెంచడానికి వివిధ కార్యక్రమాలు, పథకాలకు రూపకల్పన చేస్తోంది. ఈ పథకాల ద్వారా రైతులు అనేక విధాలుగా సహాయం పొందుతున్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇప్పటికే అనేక పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఎన్ని పథకాలు వచ్చినా.. కొంత మంది రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ముఖ్యంగా ప్రకృతి విపత్తు వచ్చిన సమయంలో అన్నదాతలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
అకాల వర్షాలకు ఓ రైతు ఎంతగానో నష్టపోయాడు. చేతికి అందవచ్చిన పంట నీట మునిగిపోవడంతో కష్టాలపాలయ్యాడు. తనకు పంట నష్టం వచ్చిందని.. తనను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాళ్లకు నమస్కరిస్తూ రైతు దీనంగా అడుగుతున్న పరిస్థితి చూసి అందరి హృదయం కలచి వేశాయి.
ఇది చదవండి : 50 ఏళ్లుగా మండుతున్న గుహ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
వివరాల్లోకి వెళితే.. శివపురి జిల్లాలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. అయితే వర్షాలు, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన తన పంటలకు పరిహారం ఇవ్వాలని కోరుతూ శివపురి జిల్లాలోని ఒక గ్రామం వద్ద మాజీ ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ కాళ్లకు నమస్కరించిన రైతు కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shivpuri: A #farmer bows down in feet of former #MLA and the district #collector at a village in Shivpuri district, seeking compensation against his crops damaged by rainfalls and hailstorm. pic.twitter.com/XHOgIfksQL
— Free Press Journal (@fpjindia) January 10, 2022