మనకు గొర్రెలు, మేకలు సుమారు రూ.4 వేల నుంచి రూ.20 వేల వరకు వాటి బరువును బట్టి రేటు పలుకుతాయి. ఇక బక్రీద్ పండుగ వచ్చిందంటే వీటి గిరాకి ఓ రేంజ్ లో ఉంటుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తుంటారు. తమకు ఉన్నంతలో పండుగను ఘనంగా చేసుకోవాలని చాలా మంది చూస్తుంటారు. ఓ మేక ధర ఏకంగా రూ.70 లక్షలు చెబుతున్నాడు దాని యజమాని. రూ.22 లక్షలిస్తామన్నా అమ్మనని అంటున్నాడు. వివరాల్లోకి వెళితే..
బక్రీద్ పండుగ సందర్భంగా పలు సంతల్లో మేకలు, గొర్రెలు అమ్మకానికి పెడుతున్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో ఓ మార్కెట్ సంతలో మేక అందరి దృష్టిని ఆకర్శించింది. వాహిద్ హుస్సేన్ అనే వ్యక్తి కొంత కాలంగా సాదుకుంటున్న మేక ధర ఏకంగా లక్షల్లో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేకకు ఆయన చెబుతున్న రేటు రూ.70 లక్షలు. ఈ మేక యజమాని వాహిద్ హుస్సేన్ దీన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. మరి ఈ మేకకు అంత ప్రత్యేకత ఏంటా అనుకుంటున్నారా? ఈ మేక దేవుడి అద్భుత సృష్టి అని.. దీని శరీరంపై ఉర్దూలో అల్లా, మహమ్మద్ అని రాసి ఉందని అందుకే ఇది అన్నింటికన్నా ప్రత్యేకమైనదని యజమాని అంటున్నాడు.
ఈ మేకకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశానని.. దీని ధర రూ.70 లక్షలు చెబుతున్నానని.. ఓ వ్యక్తి రూ.22 లక్షలు ఇవ్వడానికి రెడీ అయినప్పటికీ.. తాను మాత్రం దగ్గేదే లే అంటున్నాడు. నా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. నేను పేదరికంలో ఉన్నానని.. నా భార్యా పిల్లలను బాగా చూసుకోవాలని.. మేకను మంచి ధరకు అమ్మి నా బిడ్డల పెళ్లి చేయాలని.. నా కుమారులకు మంచి జీవనోపాధి చూపించాలని అంటున్నారు వాహిద్ హుస్సేన్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Karimnagar: పెళ్ళైన 15 ఏళ్లకు పుట్టిన బిడ్డని కారు బలితీస…