భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అలాగే.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు. ఇంతకుముందు ప్రతిభ పాటిల్.. భారత మొదటి మహిళా రాష్ట్రపతిగా పనిచేశారు.
ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు.
ద్రౌపది ముర్ముకు 68.87 శాతం(5,77,777) ఓట్లు, యశ్వంత్ సిన్హాకు37.1 శాతం (2,61,062)ఓట్లు లభించాయి. ద్రౌపది ముర్ముకు బీజేపీ, NDA భాగస్వామ్యపక్షాలతోపాటు బీజేడీ, YSR కాంగ్రెస్, టీడీపీ సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు. 68 శాతం ఓట్లతో విజయకేతనం ఎగరవేశారు. ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పట్టాభిషేకం చేయనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ నాథ్ కోవింద్ పదవీ కాలం.. ఈ నెల 24తో ముగియనుంది.
— Govardhan Reddy (@gova3555) July 21, 2022