ఇకపై డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్‌పై పైభాగంలో మొదట ‘శ్రీహరి’ అని రాసిన తర్వాతే మెడిసిన్ పేర్లను రాయాలని.. అది కూడా హిందీలోనే మెడిసిన్ పేర్లను రాయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషపై అభిమానం పెంచేందుకు ఈ విధానం అమలు పర్చాలని అన్నారు. హీందీలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లు దీన్ని అలవాటు చేయాలని సూచించారు. భోపాల్‌లో నిర్వహించిన హిందీ వ్యాఖ్యాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌ను హిందీలో రాస్తే వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. ఒక మందు పేరు క్రోసిన్, డోలో అని ఇంగ్లీస్‌లో ఉంటే.. వాటిని హిందీ అక్షరాల్లో క్రోసిన్, డోలో అని రాస్తే.. ఏమవుతుందని అన్నారు. తాను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదని, కేవలం జాతీయ భాష హిందీని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ..‘ఇంగ్లీస్ లేకుంటే ఏం సాధించలేమనే ఆలోచనను నుంచి బయటికి రావాలి. ప్రపంచంలోని చాలా దేశాలు తమ జాతీయ భాషల్లోనే అన్ని పనులు చేసుకుంటున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంగ్లీష్ లేకుండానే అభివృద్ధి సాధిస్తున్నాయి. రష్యా, జర్మనీ, జపాన్, చైనాలో ఇంగ్లీస్ ఎక్కువగా ఎవరూ మాట్లాడరు. వారి మాతృభాషల్లోనే అన్ని కార్యాలు చక్కబెట్టుకుంటారు. దేశంలో కూడా ఇంగ్లీష్‌కు బదులుగా హిందీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీనే ఉపయోగించాలి.’ అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
కాగా.. హిందీని బలవంతంగా తమపై రుద్దవద్దని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొదటి నుంచి హిందీ భాష బలవంతంపై గళం విప్పుతూనే ఉన్నారు. అయినా కూడా.. వైద్య విద్యను హిందీలో బోధించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని గాంధీ మెడికల్ కళాశాల, అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయ్ యునివర్సిటీలో కూడా తొలి సారి హిందీలో ఎంబీబీఎస్ కోర్సును బోధించనున్నారు. మరి ఇలాంటి కఠిన నిర్ణయాలు దేశంలో భాషా యుద్ధాలకు దారి తీస్తుందని పలువురు నిపుణులు, ముఖ్యమంత్రులు సైతం అభిప్రాయపడుతున్నారు.
MP | Why do we have to be a slave to English language? If Chinese, Japanese, Germans, Russians, French can study & express their talents in their own respective languages & reach high positions then why can’t our children do that?: CM Shivraj Singh Chouhan pic.twitter.com/mJ8FEMbyi0
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 16, 2022