వాళ్లిద్దరూ ప్రేమికులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి సినిమాలు చూశారు, బైక్ పై షికారులంటూ కూడా తిరిగారు. ఇలా ఎంతో అందంగా సాగిన వీరి ప్రేమాయాణం చివరికి ఊహించని మలుపు తీసుకుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు వీరి ప్రేమకథలో ఏం జరిగింది? విడిపోయారా?, లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే పూర్తి వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
అది మధ్యప్రదేశ్ భోపాల్ లోని ఇంద్రపురి సెక్టార్. ఇక్కడే ప్రేమలాంబ అనే యువతి బ్యూటిషీయన్ గా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇలా తనంతట తాను పని చేసుకుంటున్న క్రమంలోనే ఈ యువతికి బీ ఫార్మసీ చదివే హర్ష్ అనే కుర్రాడు పరిచయం అయ్యాడు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మొబైల్ నెంబర్లు ఇచ్చు పుచ్చుకుని ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకున్నారు. అలా కొన్నాళ్ల వీరిద్దరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో ఈ ప్రేమికులు మరింత దగ్గరయ్యారు. అయితే గత కొంత కాలం నుంచి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం మొదలు మొట్టారు.
అలా ఎంతో అందంగా సాగుతున్న వీరి ప్రేమకథ చివరికి ఊహించని మలుపు తీసుకుంది. విషయం ఏంటంటే? అక్టోబర్ 9న ఇద్దరు ఒకే ఇంట్లో ఉండగా ఏదో ఒక కారణం చేత ప్రేమ లాంబ, హర్ష్ వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు హర్ష్ ప్రియురాలు ప్రేమలంబపై కోపంతో ఊగిపోయాడు. తట్టుకోలేకపోయిన హర్ష్ పియురాలిని దారుణంగా గొంతు కోసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఘటన విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక యువతి మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టడంతో హర్ష్ అనే యువకుడితో ప్రేమలంబ సన్నిహితంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.., అతడు మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక పోలీసుల స్టైల్ లో విచారించగా అతడు నేనే నా ప్రియురాలిని హత్య చేశానంటూ ఒప్పుకున్నాడు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.