ఇటీవల చోటుచేసుకున్న దారుణాలన్నీ డబ్బుతో ముడిపడి ఉంటున్నాయి. ఆస్తి, అంతస్తుల కో్సం తల్లిదండ్రులను కన్న బిడ్దలు కడతేరుస్తున్నారు. అన్నదమ్ములు, అక్కా చెల్లెల్ల మధ్య అనుబంధాలు ఈ ఆస్తి వివాదాలు చిచ్చుపెడుతున్నాయి. అనంతరం అవి ముదిరి పెను విషాదాలకు దారి తీస్తున్నాయి.
ఆస్తి వివాదాలు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేలా చేస్తున్నాయి. తల్లిదండ్రులు-వారి పిల్లలు, సొంత అన్నదమ్ములు, అక్కా చెల్లెలు, భార్యా భర్తల మధ్య ఏర్పడ్డ చిన్న చిన్న ఆస్తి గొడవలు పెను విషాదాలకు దారి తీస్తున్నాయి విచక్షణ కోల్పోయి, రక్త సంబంధీకులు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇటువంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. స్కూటీపై వెళుతున్న ఓ మహిళను కారుతో డీ కొట్టారు దుండగులు. అనంతరం ఆమెపై రాళ్ల దాడి చేసి హత్య చేశారు. అయితే ఈ హత్య వెనుక ఆస్తి వివాదాలే కారణంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలబుర్గిలో న్యాయవాది, సామాజిక కార్యకర్త మజత్ సుల్తాన్.. తన భర్త సద్దాంతో కలిసి ఉంటున్నారు. సద్దాంకు నసీం, నదీం అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. అయితే ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సద్దాం కుటుంబం వేరో ప్రాంతానాకి మకాం మార్చింది. బుధవారం ఇల్లు ఖాళీ చేసి, వస్తువులను కొత్త ఇంటికి తరలిస్తున్న సమయంలో స్కూటీపై వెళ్తున్న మజత్ను.. కారులో నలుగురు దుండగులు వెంబడించారు. వెనుక నుండి స్కూటీని బలంగా ఢీ కొట్టడంతో కింద పడిపోపయిన మజత్ పై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆమె తీవ్ర రక్త స్రావమై మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో సహా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి.
మృతురాలు న్యాయవాది అని పోలీసులు గుర్తించారు. తన భార్యను చంపింది తన సోదరులేనని.. వారికి అజీం గౌడి, వసీం గౌడి అనే ఇద్దరు వ్యక్తులు సహాయం చేశారని పోలీసులకు భర్త సద్దాం ఫిర్యాదు చేశాడు. అంతక ముందు ఆస్తి విషయంలో్ తమ సోదరులు తమను అక్రమంగా జైలుకు పంపించాడని చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ స్కూటీపై వెళుతుండగా.. దుండగులు ఆమెపై దాడి చేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైందని పోలీసులు చెప్పారు. ఈ హత్యను ఎవరు చేశారు..?హత్య ఎలా చేశారు? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయన్నారు.