దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఒమిక్రాన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్నాటక సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
కర్నాటకలో ఇప్పటికే కొనసాగుతున్న నైట్ కర్ఫ్యూతో పాటు వారంతపు కర్ఫ్యూ కూడా విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే రాత్రి కర్ఫ్యూను మరో రెండు వారాల పాటు పొడగించింది కర్నాటక ప్రభుత్వం. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు వారాంతపు కర్ఫ్యూ విధించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వచ్చే 2 వారాల పాటు ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా కర్నాటక ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది.
ఇది చదవండి : విధ్వంసకర క్రికెటర్‌కు కరోనా పాజిటివ్
ప్రజలు ఎక్కువగా తిరిగే థియేటర్లు, మాల్స్, పబ్ లు, బార్ లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతిస్తామని, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదని మంత్రి ఆర్.అశోక తెలిపారు. డిసెంబర్ 28 నుంచి పది రోజుల పాటు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో ఒమైక్రాన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి.