Chikballapur: ఆమెది ఓ నిరుపేద కుటుంబం.. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆమెను చదివిస్తున్నారు. చదివేది గవర్నమెంట్ కాలేజే అయినా అది ఆమె తల్లిదండ్రులకు శక్తికి మించిన పని. అయినప్పటికి కూతురు బంగారు భవిష్యత్తుకోసం వారు శ్రమించసాగారు. ఆ యువతి కూడా తల్లిదండ్రులు గురించి ఉన్నతంగా ఆలోచించింది. తాను బాగా చదివి ఎలాగైనా తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలనుకుంది. కానీ, కథ పూర్తిగా విషాదాంతం అయ్యింది.. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిక్‌మంగళూరు జిల్లాలోని సోమనహల్లికి చెందిన లక్ష్మీ బాయి, శేఖర్ నాయక్‌ల కూతురు రక్షిత. ఈమె బసవనహల్లిలోని గవర్నమెంట్ ప్రీ గ్రాడ్యుయేషన్ కాలేజ్‌లో చదివేది.
తాను బాగా చదివి ఉన్నత స్థానంలోకి వచ్చి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకుంది. కానీ, విధి ఉంకోలా ఆమె తల రాతను రాసింది. తాజాగా, కాలేజ్‌నుంచి బస్‌లో ఇంటికి బయలుదేరిన రక్షిత మార్గం మధ్యలో బస్‌లోంచి కిందపడింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం తగిలింది. స్థానికులు, కుటుంబసభ్యులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు తలకు బలమైన గాయాలు అయ్యాయని, బతకటం కష్టం అని తేల్చి చెప్పారు. అనంతరం రక్షిత శరీర అవయవాలను డొనేట్ చేయాల్సిందిగా ఆమె తల్లిదండ్రులను కోరారు.
అంత బాధలో కూడా రక్షిత తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచించారు. తమ కూతురు అవయవాలను దానం చేయటానికి అంగీకరించారు. ఆమె రెండు కళ్లు, గుండె, రెండు కిడ్నీలు, ఊపిరి తీత్తులతో కలిపి మొత్తం 9 అవయవాలను వేరే వారికి అమర్చటానికి డాక్టర్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. స్పెషలిస్ట్‌లైన డాక్టర్ల బృందం రంగంలోకి దిగింది. చిక్‌మంగళూరులోని జిల్లా ఆసుపత్రిలో ఈ మధ్యాహ్నం ఆపరేషన్ నిర్వహించారు. బెంగళూరునుంచి చెన్నైకి వాటిని హెలికాఫ్టర్‌లో తరలించారు. అక్కడ అవసరమైన వారికి వాటిని అమర్చారు. మరి, తాను చనిపోయి 9 మందికి ప్రాణం పోసిన రక్షితపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బెడ్ రూంలో ఏకాంతంగా కలిసున్న అక్కా తమ్ముడు.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన తల్లి!