ఈ రోజుల్లో కొందరు ప్రేమ పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా వావి వరసలు మరిచి ఎఫైర్ లు పెట్టుకుని బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని నార్పోలిలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఈమె భర్త గతంలోనే మరణించడంతో తన కూతురితో పాటు ఉంటుంది. అలా వీరు ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటున్న క్రమంలోనే ఆ మహిళ కూతురు పాడు పనికి శ్రీకారం చుట్టింది.
వరుసకు తమ్ముడు అయ్యే బాబాయ్ కొడుకుతో అక్కా ఎఫైర్ పెట్టుకుంది. అలా ఇద్దరు కొంత కాలం నుంచి ప్రేమ విహారంలో తేలియాడుతున్నారు. ఇక సమయం దొరికితే ఇంట్లో దూరి పోయి శారీరకంగా కూడా కలుసుకుంటున్నారు. అయితే ఇటీవల అక్కా తమ్ముడితో ఇంట్లో శారీరకంగా కలిసున్నారు. ఈ సమయంలో ఆ యువతి తల్లి సడెన్ గా ఇంట్లో వచ్చింది. తలుపు తీసి చూడగా వీరిద్దరు కలిసి ఉండడం చూసి ఆ తల్లి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇదేం పనంటూ ఇద్దరినీ మందలించింది. ఇక నుంచైనా బుద్దిగా మారండంటూ హెచ్చరించింది.
అయినా బుద్ది మార్చుకోని అక్కా తమ్ముడు మళ్లీ పాత దారిలోనే అడుగులు వేశారు. ఇక ఇంతటితో ఆగకుండా.. మా సంబంధానికి తల్లి అడ్డుగా ఉందని ఇద్దరూ ఓ ప్లాన్ వేశారు. ఎలాగైన తన తల్లిని చంపాలని కూతురి ప్రియుడితో పాటు పథకం రచించింది. ఇందులో భాగంగానే ఇటీవల ఇద్దరు కలిసి తల్లిని బెల్ట్ తో ఉరి వేసి హత్య చేశారు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అనంతరం నిందితులు అక్కా తమ్ముడు అని తేలడంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.