దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రోడ్డు పై ప్రయాణించే సమయంలో వాహనదారులు చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి.
దేశంలో ప్రతిరోజూ దేశంలో ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లు నిర్లక్ష్యం వహించడం, నిద్రలేమితో ఇబ్బంది, సెల్ ఫోన్ ఉపయోగించడం, మద్యం సేవించి వేగంగా నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కొన్నిచోట్ల పూర్తిగా డ్రైవింగ్ పై అవగాహన లేకుండా నడపడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇతరులు చేసే తప్పిదాల వల్ల ప్రమాదాలను అంచనా వేయలేక ఎంతో మంది అమాయకులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ కారు ఎడ్లబండి ఢీ కొట్టి పల్టీలు కొట్టడం సీనిమా స్టైల్ తలపించింది. ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తమిళనాడులోని తెన్కాశి- రాజపాళ్యం రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రకారం.. వన్ వే రోడ్డు పై కారు గంటకు 40-50 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. కారు ఓ బ్రిడ్జీ వద్దకు రాగానే ఎదురుగా ఓ ఎడ్లబండిని ఢీ కొట్టింది. రెప్పపాటులో ఎడ్ల బండి కుడివైపు ఉన్న చక్రాన్ని కారు ఢీ కొట్టడంతో అమాంతం గాల్లోకి ఎగిరి బొల్తా పడి మళ్లీ యధా స్థానానంలో నిలబడింది. ఈ దృశ్యాలు మొత్తం వీడియోలో రికార్డు చేయబడ్డాయి. డ్రైవర్ కారు నడిపే సమయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.. కాకపోతే ఎడ్లబండి మాత్రం తుక్కు తుక్కైందని బాధితుడు ఆవదేన వ్యక్తం చేశాడు.
కారు ప్రమాదం జరిగిన సమయంలో అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని.. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అంటున్నారు. అలాగే ఎడ్లబండి నడిపే వ్యక్తి కూడా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీంతో స్థానికులు పెద్ద ప్రమాదం తప్పిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. దేశంలో ప్రమాదాలకు కారణం రోడ్డుపై దృష్టి పెట్టకుండా సెల్ ఫోన్ మాట్లాడటం, చాటింగ్ చేయడం లాంటి చేస్తున్నారని.. కొంతమంది మద్యం సేవించి మత్తులో డ్రైవింగ్ చేస్తూ నియంత్రణ కోల్పోతున్నారని.. ఈ కారణాల వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కాగా, ప్రమాదం జరిగే సమయంలో వెనుక నుంచి మరో కారులో డాష్ కామ్ బోర్డు లో రికార్డు అయ్యింది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.